school and protest | ఎల్లారెడ్డిపేట, ఆగస్టు 23: ఒకే టీచర్‌తో చదువులు సాగడం లేదని ఓ తండా పంచాయతీలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ బడికి తాళం ఇంకో టీచర్ వచ్చే వరకు అలాగే ఉండాలని తండా వాసులు నిరసన తెలిపిన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కిష్టూనాయక్ తండాలో జరిగింది. తండాలోని ప్రాథమిక పాఠశాలకు ఉపాధ్యాయురాలు సౌమ్య శనివారం చేరుకోగా తండా వాసులు మరో టీచర్ ఎప్పుడొస్తుందని అడిగారు.
తనకు ఏమీ తెలియదని చెప్పడంతో తమ పిల్లల చదువులెట్లయితయని ఆవేదన చెందారు. తమ తండాలో ఇది వరకే అంగన్వాడీ పాఠశాల లేక ఇబ్బందులు పడుతుంటే వారిని చూసుకోవడమే ఇబ్బంది అనుకుంటే ఇద్దరు టీచర్లలో ఒకరిని బదిలీ చేయడం ఏమిటని ఆగ్రహంతో మరో టీచర్ వచ్చే వరకు పాఠశాలకు తాళం వేస్తామని చెప్పి గేటుకు తాళం వేసి నిరసన తెలిపారు. అనంతరం ఉపాధ్యాయురాలు సౌమ్య, కార్యదర్శి మౌనిక సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెల్తామని చెప్పడంతో తాళం తీసి పిల్లలను బడిలోకి పంపించారు.