Veenavanka | వీణవంక, జూన్ 27 : గ్రామం సుభిక్షంగా ఉండాలనే పోచమ్మతల్లి గుడి నిర్మాణం చేపడుతున్నట్లు రామకృష్ణాపూర్ సర్పంచ్ దూడపాక త్రివేణి-రాజు అన్నారు. వీణవంక మండలంలోని రామకృష్ణాపూర్లో శనివారం సర్పంచ్ దూడపాక త్రివేణి-రాజు, ఉపసర్పంచ్ మ్యాకల మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో పోచమ్మతల్లి గుడి నిర్మాణానికి భూమిపూజ చేశారు.
ప్రముఖ వేదపండితులు గూడ జగదీశ్వర శర్మ కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు చేయగా, సర్పంచ్, పాలకవర్గ సభ్యులు ముగ్గుపోసి పనులు ప్రారంభించారు. గుడి నిర్మాణానికి భూమిని విరాళంగా ఇచ్చిన ఉపసర్పంచ్ మహిపాల్ రెడ్డికి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామపెద్దలు, నాయకులు రఘుపాల్‌రెడ్డి, గంగాడి తిరుపతిరెడ్డి, సాహెబ్ హుస్సేన్, దాసారపు ప్రభాకర్, అప్పని హరీష్‌వర్మ, కొమురయ్య, రాజయ్య, సంపత్, సుధాకర్, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.