Salman Khan | సొంత అపార్ట్మెంట్ ఖాళీ చేయనున్న సల్మాన్ ఖాన్.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులే కారణం
Salman Khan : బాలీవుడు సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తనతోపాటు కుటుంబ సభ్యుల భద్రత విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఉంటున్న ముంబై, బాంద్రాలోని గెలాక్సీ లగ్జరీ అపార్ట్మెంట్ను ఖాళీ చేయాలని నిర్ణయించారు. తనకు మరింత భద్రత కల్పించే కొత్త బిల్డింగులోకి మారబోతున్నారు.
Salman Khan : బాలీవుడు సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తనతోపాటు కుటుంబ సభ్యుల భద్రత విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఉంటున్న ముంబై, బాంద్రాలోని గెలాక్సీ లగ్జరీ అపార్ట్మెంట్ను ఖాళీ చేయాలని నిర్ణయించారు. తనకు మరింత భద్రత కల్పించే కొత్త బిల్డింగులోకి మారబోతున్నారు. దాదాపు 50 ఏళ్లుగా ఉంటున్న ఇంటిని విడిచిపెట్టబోతున్నారు. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి తరచూ బెదిరింపులు, తన ఇంటివద్ద కాల్పుల నేపథ్యంలో సల్మాన్ ఖాన్ కొత్త ఇంటిలోకి మారాలని నిర్ణయించుకున్నారు.
సముద్రం ఎదురుగా, ఆరంతస్తుల బిల్డింగ్ నిర్మాణానికి ప్రభుత్వ అనుమతులు కూడా లభించాయి. మహారాష్ట్ర కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ ఈ నెల 16న అనుమతులు మంజూరు చేసింది. దీంతో బాంద్రాలోని చింబాయ్ ప్రాంతంలో త్వరలోనే ఇంటి నిర్మాణం ప్రారంభం కానుంది. ఈ ఇంటి నిర్మాణం పూర్తైన తర్వాత ఆయన గెలాక్సీ అపార్ట్మెంట్ వదిలి ఇక్కడికి వస్తారు. సల్మాన్ తాను ప్రస్తుతం ఉంటున్న గెలాక్సీ అపార్ట్మెంట్ ఏరియాలో 1974 నుంచి ఉంటున్నారు. దీనికి సమీపంలోనే కొత్త అపార్ట్మెంట్ నిర్మించబోతున్నారు. ఇక్కడ సల్మాన్ తనతోపాటు కుటుంబ సభ్యులతో ఇక్కడే ఉండబోతున్నారు. కొత్త ఇల్లు 1,014 చదరపు మీటర్లలో ఉండనుంది.
గ్రౌండ్ ఫ్లోర్, స్టిల్ట్ పార్కింగ్ కాకుండా మరో ఆరు ఫ్లోర్లతో దీన్ని నిర్మించనున్నారు. భద్రత విషయంలో సల్మాన్ ఖాన్ కొంతకాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు, ఇంటి సమీపంలో కాల్పుల ఘటనలతో ఆయన భద్రతకు ముప్పు పొంచి ఉంది. దీంతో ఆయన పూర్తి భద్రత ఉండేలా కొత్త అపార్ట్మెంట్ నిర్మించుకుంటున్నారు. సల్మాన్ ఖాన్కు ఇప్పటికే ప్రభుత్వం వై+ కేటగిరి భధ్రత కల్పిస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
Non Veg | నాన్వెజ్ తినే మహిళలు వందేళ్లు బతుకుతారంట.. సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

