Guides of society | సిరిసిల్ల రూరల్, సెప్టెంబర్ 6: ఉపాధ్యాయుల సమాజానికి మార్గదర్శకులనీ ఎస్బీఐ లైఫ్ సిరిసిల్ల బ్రాంచ్ మేనేజర్ ప్రభాకర్ పేర్కొన్నారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చంద్రంపేటలో సిరిసిల్ల ఎస్బీఐ లైఫ్ బ్రాంచ్ కార్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను ఉపాధ్యాయుల సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సీట్లు పంపిణీ చేశారు.
అనంతరం శాలువాతో ఉపాధ్యాయులను సన్మానించారు. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కార్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం పట్ల ఉపాధ్యాయులు మేనేజర్ ప్రభాకర్‌ను అభినందించారు. ఈ సందర్భంగా తమకు సన్మానం చేయడం పట్ల ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనిట్ మేనేజర్స్ జక్కుల అన్వేష్ యాదవ్, అలువాల శ్రీనివాస్ యాదవ్, మహేశుని శివానంద్ నేత, సోమారపెట రాజు, సురేందర్ రెడ్డి, ఆడెపు ఉమేశ్, సత్తయ్య, ప్రసాద్, సుబ్బంది, ఎస్బీఐ లైఫ్ మిత్రలు పాల్గొన్నారు.