Teacher promotions | సారంగాపూర్, జూలై 14: ఉపాధ్యాయులకు వెంటనే బదిలీలతో కూడిన పదోన్నతులు చేపట్టాలని స్టేట్ టీచర్స్ యూనియన్ (STU) జిల్లా అధ్యక్షుడు మచ్చ శంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలో ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో సోమవారం ఎస్టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్కూల్ అసిస్టెంట్ నుండి ప్రధానోపాధ్యాయులకు, ఎస్జీటీ నుండి స్కూల్ అసిస్టెంట్లకు బదిలీలతో కూడిన పదోన్నతులు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బదిలీలు చేయకుండా పదోన్నతులు కల్పిస్తే సీనియర్ ఉపాధ్యాయులు నష్టపోతారని అన్నారు. ఉపాధ్యాయుల జీపీఎఫ్, మెడికల్ బిల్లులు చెల్లించాలని, ఉపాధ్యాయుల రిటైర్మెంట్ రోజే వారికి రావాల్సిన అన్ని రకాల నగదును చెల్లించాలని కోరారు. పీఆర్సీ అలాగే ఎండింగ్ దు డిఏలు ప్రకటించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సుద్దాల శ్రీధర్, భ్యుక్య మురళి, జిల్లా కార్యదర్శి జోగ రవి, మండల అధ్యక్ష కార్యదర్శులు నరేష్, విష్ణు, ఉపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు.