Appointed | వీణవంక, ఫిబ్రవరి 20 : వీణవంక మండలంలోని రెడ్డిపెల్లి గ్రామానికి చెందిన ఫొటోగ్రాఫర్ తాటిపాముల శ్రీనివాస్ ఫొటో అండ్ వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వీణవంక మండల కేంద్రంలో గ్రామపంచాయతీ ఎదురుగా సోనీ ఫొటో స్టూడియో నిర్వహిస్తూ ఉత్తమ ఫొటోగ్రాఫర్‌గా, వీడియోగ్రాఫర్‌గా మంచి పేరు తెచ్చుకొని, మండల ప్రజల ప్రశంసలు పొందారు.
ఉత్తమ ఫొటోగ్రఫీని గుర్తించిన జిల్లా యూనియన్, జిల్లా ఫొటో అండ్ వీడియో గ్రాఫర్ సంక్షేమ సంఘానికి ఉపాధ్యక్షులుగా నియమించారు. ఈ సందర్భంగా తాటిపాముల శ్రీనివాస్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన తోటి ఫొటోగ్రాఫర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సలహాదారులు మహిమల కేదార్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిరి రవి, జిల్లా అధ్యక్షుడు తుమ్మ చందు, ప్రధాన కార్యదర్శి జక్కుల భూమన్న, కోశాధికారి బొంగోని మధు, వివిధ మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారులు తదితరులు పాల్గొన్నారు.