KTR | ఎల్లారెడ్డిపేట, జూలై 23 : బండలింగంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివి ట్రిపుల్ ఐటీ సీటు సాధించిన విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని సర్పంచ్ బాల్‌రాజ్ నర్సాగౌడ్ ట్యాబ్‌ను అందించి ఉదారతను చాటుకున్నాడు. గురువారం పాఠశాల ఆవరణలో ట్రిపుల్ ఐటీ విద్యార్థి శ్రీరామోజు అఖిల్‌కు రూ.20 వేల విలువైన ట్యాబ్‌ను అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఉన్నారు.