కమాన్చౌరస్తా, జనవరి 21: ఇండియన్ టాలెంట్ న్యూఢిల్లీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి మ్యాథ్స్ ఒలింపియాడ్ ప్రథమ దశలో అల్ఫోర్స్ విద్యార్థులు ప్రతిభ చూపి రెండో దశ పరీక్షలకు ఎంపికవ్వగా, వారిని విద్యాసంస్థల అధినేత డాక్టర్ నరేందర్ రెడ్డి కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో సూల్లో అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు గణితం ముఖ్యమని, పలు పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి ఉపయోగపడుతుందని చెప్పారు.
ఈ పరీక్షలో చంద్రహాస్ దుర్శెట్టి, సిద్విక్ నార్ల, ఎర్ర లిఖిత్ కుమార్, పంచారియ, శ్లోక పున్నం, లాలిత్య పెనుకుల, రోహన్ గుండ, సీహెచ్ అనగలక్ష్మి, రోమైన ఫాతిమ, శ్రేయాస్ రెడ్డి, లిఖిత్ సాయి బొందుగుల, సాయి రిషిక రెడ్డి బిచ్చాల తదితరులు ప్రతిభ చూపినట్లు చెప్పారు. వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.