కార్పొరేషన్, డిసెంబర్ 20: గణిత దినోత్సవం సందర్భంగా ఎస్సీఈఆర్టీ హైదరాబాద్ వారు ప్రతి సంవత్సరం నిర్వహించే రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక సదస్సుకు జ్యోతి ఎడ్యుకేషనల్ ఇన్సిట్యూట్, భరోసా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు అకెనపల్లి శివజ్యోతి సమర్పించిన పరిశోధన పత్రం రాష్ట్ర స్థాయికి ఎంపికైంది. ఈనెల 22 న హైదరాబాద్ లో నిర్వహించబోయే గణిత సదస్సులో నిత్యజీవితంలో గణితం యొక ఆవశ్యకత అనే అంశంపై తన రీసెర్చ్ పేపర్‌ను ప్రజెంట్ చేయనున్నారు. రాష్ట్ర స్థాయికి సదస్సుకు మూడోసారి ఎంపికైన శివజ్యోతిని ఆకేనపల్లి నాగరాజు, వైశ్య నాయకులు, భరోసా సంస్థ సభ్యులు అభినందించారు.
పెద్దపల్లి కమాన్/ జ్యోతినగర్, డిసెంబర్ 20 : విధులకు హాజరుకాని ప్రభుత్వ టీచర్ శ్రీనివాస్‌ను సస్పెండ్ చేసినట్లు పెద్దపల్లి డీఈవో డీ మాధవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్టీపీసీ పట్టణ పరిధిలోని నర్రశాలపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల సెకండరీ గ్రేడ్ టీచర్ కోట శ్రీనివాస్ తన స్థానంలో వేరే ప్రైవేట్ వ్యక్తిని నియమించాడని, కొద్ది రోజులుగా గైర్హాజరవుతున్నట్టు గుర్తించామని చెప్పారు. రామగుండం ఎంఈవో సంపత్‌రావు ఇచ్చిన రిపోర్టు ప్రకారం శ్రీనివాస్‌ను సస్పెండ్ చేశామని చెప్పారు.