Veenavanka | వీణవంక, మార్చి 27 : వీణవంక మండలంలోని పోతిరెడ్డిపల్లి, కొండపాక, హిమ్మత్‌నగర్, వల్బాపూర్, చల్లూరు గ్రామాల్లో శుక్రవారం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణాల మధ్య సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా జరిపించారు. పోతిరెడ్డిపల్లిలో పరిపాటి పవన్‌రెడ్డి, హిమ్మత్‌నగర్ చైర్మన్ నల్ల తిరుపతిరెడ్డి, కొండపాకలో ఆలయకమిటీ ఆధ్వర్యంలో స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా జరిపించగా, హిమ్మత్‌నగర్‌లో గెల్లు కొమురయ్య దంపతులు అన్నదాన కార్యక్రమంలో భాగంగా పండ్లు పంపిణీ చేశారు.
ఆయా ఆలయ కమిటీల ఆధ్వర్యంలో మహాన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు జడల శ్రీకాంత్, గజ్జెల మొగిలయ్య, దాట్ల వీరస్వామి, ఉపసర్పంచ్లు మాక శ్రీనివాస్, సొసైటీ మాజీ డైరెక్టర్ కామిడి కావ్య-శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు పరిపాటి రవీందర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, గెల్లు రమేష్, గజ్జెల శ్రీకాంత్, ప్రశాంత్, పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.