Suicide | హైదరాబాద్‌లో జగిత్యాలకు చెందిన సాప్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
ఒంటరితనం భరించలేక మానసిక ఒత్తిడితో జగిత్యాలకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది.
Suicide | జగిత్యాల కలెక్టరేట్ : ఒంటరితనం భరించలేక మానసిక ఒత్తిడితో జగిత్యాలకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని హనుమాన్ వాడకు చెందిన సింధూజ అలియాస్ తుషారిక (36) నెక్ట్స్ టర్న్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఏడాదికి రూ.26 లక్షల వేతనంతో పనిచేస్తోంది. కాగా మియాపూర్‌లోని గోకుల్ ప్లాట్స్, ప్రజయ్ మెగా పోలీస్ అపార్ట్మెంట్లో నివాసముంటోంది. పదేళ్ల క్రితం వివాహం కాగా, ఏడాది తర్వాత విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటోంది.
ఈ నెల 26న ఉదయం సుమారు 10:30 గంటలకు అదే కంపెనీలో పనిచేసే స్నేహితుడు రాజిరెడ్డి ఫోన్ చేసినప్పటికీ ఆమె స్పందించలేదు. దీంతో అనుమానంతో ఆమె నివాసానికి వెళ్లి చూడగా, ఆమె మృతిచెందినట్లు గుర్తించి కుటుంబ సభ్యులు, మియాపూర్ పోలీసులకు సమాచారమందించాడు. పోలీసుల పరిశీలనలో సూసైడ్ నోట్ లభించింది. అందులో గత నాలుగు నెలలుగా ఒంటరితనం, మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు, ఆ పరిస్థితుల నుంచి బయటపడలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఇందిరమ్మ బీమా నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి : కలెక్టర్ అంకిత్
Abhijeet Dipke | ‘నేను ఇక్కడే ఉన్నా, నన్ను అరెస్ట్ చేయండి’.. లుకౌట్ నోటీస్‌పై అభిజిత్ దిప్కే
Tragedy | ఘోరం.. ఇనుపకడ్డీలు మీదపడి డిగ్రీ విద్యార్థిని మృతి
AP Cabinet | ఏపీ కేబినెట్ కీలక అంశాలకు ఆమోదం.. పెనుకొండలో కియా ప్లాంట్-2కు పచ్చ జెండా
Samsung | గెలాక్సీ ఏఐకి కొత్త ప్రైవేట్ క్లౌడ్ సెక్యూరిటీ.. శాంసంగ్ కీలక ప్లాన్..
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

