కోనరావుపేట, జూలై 9: ఎక్కడో పుట్టారు.. ఎక్కడో పెరిగారు.. కానీ చదువులమ్మ చెట్టు నీడ లో చేరి వారంతా ఒక్కటయ్యారు. పదేండ్లపా టు కలిసి చదువుకున్నారు. ఈ క్రమంలో విద్యా బుద్ధులు నేర్పిన పాఠశాలలో మరిన్ని వసతులు కల్పించేందుకు ముందుకొచ్చారు. 480కి పైగా మందితో పూర్వ విద్యార్థుల అసోసియేషన్ ఏర్పాటు చేసి 20లక్షలతో పాఠశాల భవనం, 2లక్షలతో వసతుల కల్పించి ఆదర్శంగా నిలు స్తున్నారు కోనరావుపేట మండలం నిజామాబా ద్‌లోని ప్రభుత్వ పాఠశాల పూర్వ విద్యార్థులు.
2019లో కమిటీ
1970నుంచి పాఠశాలలో చదివిన విద్యార్థులంతా 2019లో మొదటగా 14మందితో కమిటీని ఎన్నుకున్నారు. అనంతరం పాఠశాలలో చదివిన విద్యార్థులకు తమ కమిటీ గురించి చెప్పడంతో చాలామంది ముందుకొచ్చారు. వారి వంతు సాయం అందిస్తామని చేయిచే యీ కలుపడంతో అసోసియేషన్‌లో 480మందికి పైగా సభ్యులుగా చేరారు. ఇలా వారంతా ఒకే వాట్సాప్ గ్రూప్ ద్వారా పాఠశాలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నారు.
విద్యాభివృద్ధికి తోడ్పాటు..
పాఠశాలలో 20లక్షలతో అదనపు భవనా న్ని నిర్మించారు. గ్రామస్తులు, పూర్వ విద్యార్థులంతా కలిసి 76,400తో హ్యాండ్వాష్ప్లాట్ రూమ్‌ను నిర్మించారు. విద్యార్థులకు 40వేల తో ఆట వస్తువులు అందించారు. డిజిటల్ బోధ న కోసం 25వేలతో ఎల్ఈడీ టీవీ, 40వేలతో వర్క్‌బుక్స్ అందించి, విద్యాభివృద్ధికి తోడ్పాటునందించారు. విద్యా వలంటరీని నియమించి ప్రతినెలా 5వేలు చెల్లిస్తున్నారు. చదువు, ఆటల్లో ప్రతిభ చూపినవారికి ప్రోత్సాహక బహుమతులు, నగదు అందిస్తున్నారు.
సౌకర్యాలు మంచిగున్నయ్
పూర్వ విద్యార్థులంతా కలిసి అసోసియేషన్ ఏర్పా టు చేయడం సంతో షక రం. 480కి పైగా మం ది కలిసికట్టుగా అసోసియేష న్ ఏర్పాటు చేసి, పాఠశాల ను అభివృద్ధి చేస్తున్నారు. పాఠశాలలో భవన నిర్మాణం తోపాటు, అనేక వసతులు కల్పిస్తున్నారు. ప్రస్తుతం పాఠశాలలో సౌకర్యాలు మంచిగున్నయ్.
– శ్రీనివాస్, విద్యార్థి తండ్రి, నిజామాబాద్
అదృష్టంగా భావిస్తున్నా..
విద్యాబుద్ధులు నేర్పిన నిజామాబాద్ ప్రభుత్వ పాఠశాలకు సాయం చేయ డం అదృష్టంగా భావిస్తు న్నా. మేమంతా క్రమశిక్ష ణతో కూడిన విద్యనభ్య సించి ఉన్నత స్థాయికి ఎది గాం. పాఠశాలకు తమ వంతుగా చేయూ తనందించాలని అసోసియేషన్ ఏర్పాటు చేశాం. వాట్సాప్ గ్రూప్ ద్వారా ప్రతిరోజూ మంచి చెడులను పంచుకోవడంతో పాటు పాఠశాల అభివృద్ధికి పాటుపడుతున్నాం. ఇలాంటి సేవచేయడం అదృష్టంగా భావిస్తున్నాం.
– నవీన్, పూర్వవిద్యార్థుల అసోసియేషన్ ఉపాధ్యక్షుడు
సకల వసతులు
పాఠశాలలో 20లక్షలతో అధునాతన భవనాన్ని నిర్మించా రు. విశాలమైన తరగతి గదులతో పాటు గ్రంథాలయ గది, సమావే శం మందిర నిర్మాణం చేపట్టారు. గ్రామస్తులు, పూర్వ విద్యార్థుల సహకారంతో 76,400 తో వాషింగ్ ప్లాట్‌ఫాం, మరో 4ల క్షలతో ఆట వస్తువులు, వర్క్‌బుక్స్, ఎల్ఈడీ టీవి ఇలా అనేక వసతులను సమకూర్చారు.
– రవీందర్, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం