కమాన్‌చౌరస్తా, మే 11: శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ రెండో, నాలుగో, ఆరో సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం ఈ నెల 14 నుంచి యథావిధిగా ప్రారంభం అవుతాయని, విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం కావాలని విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ డీ సురేశ్‌కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
పరీక్ష ఫీజులు చెల్లించిన విద్యార్థులకే పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఫీజు చెల్లించని ప్రైవేట్ కళాశాల విద్యార్థులు ఈ నెల 12లోగా ఫీజులు చెల్లించాలని సూచించారు. త్వరలోనే విద్యార్థులకు హాల్ టికెట్లు జారీ చేస్తామని తెలిపారు.