Odela | ఓదెల, అక్టోబర్ 1 : పెద్దపల్లి జిల్లా ఓదెల జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు జిల్లా స్థాయి కబడ్డీ పోటీలల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. పాఠశాలకు చెందిన పేరం అక్షయ సబ్ జూనియర్ కబడ్డీ పోటీలకు, బీరం అరవింద్ జూనియర్ కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. వీరిని సర్పంచ్ కనికి రెడ్డి సతీష్ అభినందించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మ మాట్లాడుతూ విద్యార్థులు ఇదే స్ఫూర్తితో క్రీడల్లో రాణించి జాతీయస్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. పాఠశాల పీడీ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎంపికైన విద్యార్థులు అక్టోబర్ 2, 3, 4, 5 తేదీలలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో నిర్వహించే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.