జమ్మికుంట, ఏప్రిల్ 19 : సీఎంఆర్ఎఫ్ స్కాంకు పాల్పడిన కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని సప్తగిరి ప్రైవేట్ దవాఖాన రిజిస్ట్రేషన్ రైద్దెంది. సదరు దవాఖానకు చెందిన వైద్యులు, రోగులకు చికిత్స చేయకపోయినా.. చేసినట్లు నకిలీ బిల్లులు సృష్టించి సీఎంఆర్ఎఫ్ నుంచి నిధులు స్వాహా చేశారనే ఫిర్యాదుల నేపథ్యంలో సీఐడీ అధికారులు 2022-23లో కేసు నమోదు చేశారు. పలుసార్లు విచారణ చేసిన సంగతి తెలిసిందే. విచారణలో స్కాం నిజమేనని నిర్ధారణకు వచ్చారు. దీంతో జమ్మికుంట పట్టణంలోని సప్తగిరి దవాఖాన రిజిస్ట్రేషన్‌ను (అనుమతులు)ఉన్నతాధికారులు రద్దు చేశారు.
ఈ మేరకు మూడు రోజుల క్రితమే దవాఖాన నిర్వాహకులకు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ నుంచి గుర్తింపు రద్దు చేస్తూ నోటీసులు జారీ అయ్యాయి. అయితే, నోటీసులు అందుకున్నప్పటికీ సదరు దవాఖాన నిర్వాహకులు దవాఖానను నడిపిస్తున్నారే సమాచారం మేరకు ఉన్నతాధికారులు తనిఖీలు నిర్వహించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో డీఎంహెచ్‌వో సూచనల మేరకు హుజూరాబాద్ డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ చందు ఆధ్వర్యంలో సిబ్బంది శనివారం సప్తగిరి దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేసి, పరిశీలించారు.
ఈ సమయంలో వైద్యులు, నిర్వాహకులు ఎవరూ అందుబాటులో లేరు. వార్డులు, చికిత్స, తదితర గదులను చూశారు. రికార్డులు పరిశీలించారు. కాగా, ‘సప్తగిరి’ అనుమతులు రద్దు, సీజ్‌పై డిప్యూటీ డీఎంహెచ్‌వోను వివరణ కోరగా.. సీఎంఆర్ఎఫ్ నిధుల స్వాహా జరిగింది నిజమేనని నిర్ధారణకు వచ్చామని, సప్తగిరి అనుమతులు కూడా డీఆర్ఏ నుంచి రద్దు చేస్తున్నట్లు నోటీసులు కూడా జారీ చేశామని చెప్పారు. దవాఖాన నిర్వాహకులకు నోటీసులు అందాయన్నారు. త్వరలో సీజ్ కూడా చేస్తామని చెప్పుకొచ్చారు. దవాఖాన నడిపించినైట్లెతే కఠిన చర్య లు తీసుకుంటామన్నారు. తనిఖీల్లో సిబ్బంది ప్రతాప్, నరేందర్, రాజు ఉన్నారు.