కరీంనగర్ కమాన్‌చౌరస్తా, డిసెంబర్ 10 : తమ సమస్యలను పరిష్కరించాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం ఆ సంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట నిరవదిక నిరసన దీక్షలు ప్రారంభించారు. కరీంనగర్లో చేపట్టిన దీక్షకు కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు గీట్ల ముకుందరెడ్డి మద్దతు తెలిపారు.
సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. జగిత్యాలలోని తహసీల్ చౌరస్తాలో ఉద్యోగులు నిరసన దీక్షలు ప్రారంభించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నిరవధిక సమ్మె దీక్షలు చేపట్టామన్నారు.
ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని, పేస్కేల్ ఇవ్వాలని, ప్రతి ఉద్యోగికి 10 లక్షలు జీవిత, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని, పదవీ విరమణ చేస్తున్న వారికి చేసిన వారికి బెనిఫిట్స్ 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యాశాఖ నియామకాలలో వెయిటేజ్ కల్పించాలని, పీటీఐలకు 12 నెలల వేతనం అందించాలని డిమాండ్లతో సమ్మె చేస్తున్నామని చెప్పారు.