Mallapur | స్వామియే శ్రీ కనక సోమేశ్వర నమో నమ..! మల్లాపూర్లో వైభవంగా వైభవంగా శ్రావణమాస ఉత్సవాలు
స్వామియే శ్రీ సోమేశ్వర నమో నమః అనే భక్తుల శివ నామస్మరణాలతో మల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రసిద్ధి గాంచిన శ్రీ కనక సోమేశ్వరస్వామి కొండ మార్మోగింది. ప్రాచీన చరిత్ర గల శ్రీ కనక సోమేశ్వరస్వామి ఆలయం సుమారు పదహారు వందల అడుగుల ఎత్తైన ఏక శిల కొండపై శ్రీ కనకసోమేశ్వరస్వామి ఆలయం కొలువుదీరిన సంగతి తెలిసిందే.
- శివ నామస్మరణతో మార్మోగిన శ్రీ కనక సోమేశ్వరస్వామి కొండ
- భారీ వర్షంలో సైతం పొటెత్తిన భక్తజనం, వరదపాశం పోసి మొక్కుల చెల్లింపు
Mallapur | మల్లాపూర్, ఆగష్టు 24 : స్వామియే శ్రీ సోమేశ్వర నమో నమః అనే భక్తుల శివ నామస్మరణాలతో మల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రసిద్ధి గాంచిన శ్రీ కనక సోమేశ్వరస్వామి కొండ మార్మోగింది. ప్రాచీన చరిత్ర గల శ్రీ కనక సోమేశ్వరస్వామి ఆలయం సుమారు పదహారు వందల అడుగుల ఎత్తైన ఏక శిల కొండపై శ్రీ కనకసోమేశ్వరస్వామి ఆలయం కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఇక్కడ ప్రతీ ఏటా శ్రావణమాసంలో ఐదు సోమవారాల పాటు భక్తులు కాలినడకన కొండపైకి ఎక్కి కొండపై గల సహజసిద్ధమైన కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి ఎంతో భక్తి శ్రద్ధలతో సోమేశ్వరస్వామికి ప్రీతిపాత్రమైన వరదపాశం (బెల్లం అన్నం)ను వండి ఆలయం ఎదుట వరదపాశం పోసి తమ మొక్కులను చెల్లించి అక్కడే సహంపక్తి భోజనాలు చేయడం అనావాయితీ.
రెండవ సోమవారం సందర్భంగా భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లను చేశారు. భక్తులకు కొండ కింద గ్రామానికి చెందిన శివ శ్రీనివాస్ మల్లీశ్వరి దంపతుల ఆధ్వర్యంలో మహా అన్నదానం చేశారు. ఆలయ ప్రధాన ఆర్చకుడు బల్యపల్లి ప్రభాకరశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలను చేశారు. ఈ వేడుకల్లో ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, అదిలాబాద్ జిల్లాలతో పాటు, మహారాష్ట్ర ప్రాంతాలను నుండి భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, ఆలయ కమిటీ అధ్యక్షుడు క్యాతం సురేష్ రెడ్డి, మాజీ చైర్మన్ సంగ గంగారాజం, ఉపసర్పంచ్ గడ్డం సోమారెడ్డి, మాజీ జడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కమిటీ సభ్యులు, అధికారులు, అఖిలపక్షం పార్టీల నాయకులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Puneeth Rajkumar: గంటన్నర పాటు కిక్ బాక్సింగ్.. పునీత్ రాజ్కుమార్ చివరి క్షణాలు గురించి చెప్పిన డాక్టర్
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

