Godavarikhani | ప్రపంచ చర్చా వేదికకు రామగుండం మేయర్ మహంకాళి స్వామి
అఖిల భారత స్థానిక స్వయం పరిపాలన సంస్థ తన శతాబ్ధి ఉత్సవాల నిర్వహణలో భాగంగా ముంబైలోని ఫెయిర్ మాండ్ హోటల్ లో ఈనెల 25, 26 తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న మూడో ప్రపంచ మేయర్ల చర్చా వేదిక- 2026 కు పెద్దపల్లి జిల్లా నుంచి రామగుండం మేయర్ మహంకాళి స్వామిని నామినేట్ చేశారు.
Godavarikhani | కోల్ సిటీ, నవంబర్ 24 : అఖిల భారత స్థానిక స్వయం పరిపాలన సంస్థ తన శతాబ్ధి ఉత్సవాల నిర్వహణలో భాగంగా ముంబైలోని ఫెయిర్ మాండ్ హోటల్ లో ఈనెల 25, 26 తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న మూడో ప్రపంచ మేయర్ల చర్చా వేదిక- 2026 కు పెద్దపల్లి జిల్లా నుంచి రామగుండం మేయర్ మహంకాళి స్వామిని నామినేట్ చేశారు. ఈ మేరకు తెలంగాణ పురపాలక పరిపాలన శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ టీకే శ్రీదేవి నుంచి అందుకున్న ఆహ్వానం మేరకు మంగళవారం ఆయన రామగుండం నుంచి ముంబైకి బయలుదేరి వెళ్లారు.
కాగా, ఈ ఫోరమ్ ఉద్దేశం సుస్థిర పట్టణ, నగర అభివృద్ధిలో సంస్కరణలు, వినూత్న పద్ధతులను పంచుకోవడానికి మేయర్, కమిషనర్, పట్టణ నిపుణులు, విధాన రూపకర్తలను భాగస్వాములను చేస్తూ ఒక చోట చేర్చుతోంది. ఉమ్మడి జిల్లా నుంచి రామగుండం మేయర్ మహంకాళి స్వామితోపాటు కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రఫుల్ దేసాయి, జగిత్యాల మున్సిపల్ కమిషనర్ సత్యప్రణవ్ పాల్గొననున్నారు. ప్రపంచ స్థాయి సదస్సులో పాల్గొనేందుకు రామగుండం మేయర్ కు అవకాశం రావడం పట్ల స్థానిక కార్పొరేటర్లు హర్షం వ్యక్తం చేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BDL | బీడీఎల్ సంగారెడ్డిలో 134 ఐటీఐ అప్రెంటిస్ ఖాళీలు.. చివరితేదీ నవంబర్ 30
Punjab Elections | బీజేపీ, అకాలీదళ్ పార్టీ మధ్య కుదిరిన పొత్తు.. పంజాబ్లో ఆరేళ్ల తర్వాత మళ్లీ కలిసిన బంధం..!
Harish Rao | రేవంత్ రెడ్డి గురుదక్షిణ వల్లే పాలమూరులో పంటలు ఎండిపోయాయి : హరీశ్ రావు
Fetal Back Surgery | భారత వైద్య రంగంలో అరుదైన ఘనత.. గర్భస్థ శిశువుకు విజయవంతంగా వెన్నెముక చికిత్స..
Burnt alive | జాతీయ రహదారిపై ప్రమాదం.. ఇద్దరు సజీవదహనం
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

