Narayana Raopalli | సుల్తానాబాద్ రూరల్, డిసెంబర్ 7 : పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నారాయణరావుపల్లి గ్రామ సర్పంచ్ గా నామని రాజిరెడ్డి ఏకగ్రీవం ఖరారు అయినట్లే. సుల్తానాబాద్ మండలంలో మూడో విడతలో ఎన్నికల్లో భాగంగా ఈ నెల 3 నుంచి 5 వరకు అధికారులు సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ స్వీకరించారు.
నామినేషన్ల గడువు మూసే వరకు నారాయణరావుపల్లి గ్రామం నుంచి నామని రాజిరెడ్డి నామినేషన్ ఒకటే రావడంతో ఏకగ్రీవానికి మార్గం సుమంగమైంది. ఈ సందర్భంగా గ్రామస్తులు గజమాలతో రాజిరెడ్డిని ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు.