Siricilla | రేవంత్.. చిల్లర రాజకీయాలు మానుకో :టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్

సిరిసిల్ల టౌన్ : ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ చేస్తున్న చిల్లర రాజకీయాలు ఇకనైనా మానుకోవాలని టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు వెంగళ శ్రీనివాస్ హెచ్చరించారు.
ఆదివారం ఆయన జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి ప్రజల్లో ఆదరణ కోసం మంత్రి కేటీఆర్‌పై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. ఎవరి చరిత్ర ఏంటో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసన్నారు. డ్రగ్స్‌కు సంబంధించిన ఆరోపణలపై మంత్రి కేటీఆర్ ఏ పరీక్షలకైనా తాను సిద్ధమని ప్రకటించారని, మీ పార్టీ జాతీయ నేత రాహుల్‌గాంధీ డ్రగ్స్ పరీక్షలు చేయించుకుని దేశ యువతకు ఆదర్శంగా నిలవాలని డిమాండ్ చేశారు.
నోరుంది కదా అని మంత్రి కేటీఆర్‌పై మరోసారి ఇష్టారీతిన మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తీసుకొచ్చిన దళితబంధు పథకం తర్వాత కాంగ్రెస్ నాయకులు దిక్కుతోచని స్థితిలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. సమావేశంలో నాయకులు దుబాల వెంకటేశం, వేముల చెన్నయ్య, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

