Matla Madhu | మంత్రి పొన్నం వస్తే.. చర్చకు సిద్ధమే: బీఆర్ఎస్ నేత మాట్ల మధు
సర్పంచ్ ఎన్నికల్లో తనకు డబ్బులు ఇచ్చారన్న ఆరోపణలపై మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చకు రావాలని, తాను కూడా సిద్ధమే అని బీఆర్ఎస్ సీనియర్ నేత, సర్పంచ్ల ఫోరం జిల్లా మాజీ అధ్యక్షుడు మాట్ల మధు (Matla Madhu) అన్నారు.
సిరిసిల్ల రూరల్, మార్చి 14: సర్పంచ్ ఎన్నికల్లో తనకు డబ్బులు ఇచ్చారన్న ఆరోపణలపై మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చకు రావాలని, తాను కూడా సిద్ధమే అని బీఆర్ఎస్ సీనియర్ నేత, సర్పంచ్ల ఫోరం జిల్లా మాజీ అధ్యక్షుడు మాట్ల మధు (Matla Madhu) అన్నారు. కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. తంగళ్లపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత 10 రోజులుగా జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఈ నెల 15 సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో చర్చకు సిద్ధమేనని, మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా రావాలని సవాల్ విసిరారు. 12 ఏండ్ల క్రితం జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో తనకు పొన్నం ప్రభాకర్ డబ్బులు ఇచ్చారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారని, వాటిని ఇప్పటికే ఖండించానని, ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరినట్లు పేర్కొన్నారు.
కాంగ్రెస్ నేతలు తనపై వ్యక్తిగతంగా, కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొన్నం ప్రభాకర్ వచ్చి తనకు డబ్బులు ఇచ్చినట్లు చెబితే, దేనికైనా సిద్ధమన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ అంటే తమ గౌరవం ఉందని, తనకు వీలుకాకుంటే, పొన్నం ప్రభాకర్ వద్దకే వస్తామని చెప్పారు. హుస్నాబాద్ అయినా సరే, హైదరాబాద్ అయినా సరే సమయం చెబితే వస్తానని పేర్కొన్నారు. తమ నాయకుడు కేటీఆర్‌ను కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తనే, దీటుగా స్పందించామని పేర్కొన్నారు. జరుగుతున్న పరిణామాలన్నింటికీ కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి కారణమని, ఆయనే బాధ్యతవహించాలని మరోసారి డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నేత కేకే, కాంగ్రెస్ నేతలు తీరు మార్చుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో కుర్మా రాజయ్య, కొయ్యడ రమేష్, ఆత్మకూరి చంటి, గుండు ప్రేమ్ కుమార్, సిలువేరి చిరంజీవి, గొడిసెల ఎల్లయ్య, శ్రీకాంత్ రెడ్డి, నవీన్ రెడ్డి, అమర్ రావు, మల్లారాపు నరేష్, తదితరులు ఉన్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

