పల్లెటూరి పిల్లగాళ్లు.. షార్ట్ ఫిల్మ్ స్టార్స్
సారంగాపూర్ మం డలంలోని కోనాపూర్, పెంబట్ల గ్రామాలకు చెందిన తిరుకోవెల చంద్రం, తనుగుల చంద్రశేఖర్, దోసారపు రాజకమలాకర్ గౌడ్, తిరుకోవెల పూర్ణచందర్, బొడ్డుపెల్లి లక్ష్మణ్, సీలం మల్లేశ్, నిమిషకవి గంగాధర్, తిరుకోవెల ఆంజనేయులు, తిరుకోవెల సురేశ్, చింతకుంట శ్రీకాంత్, నరేందర్‌రావు, తిరుమల శ్రీనివాస్, విష్ణువర్దన్, బొమ్మకంటి ప్రమోద్, బొమ్మకంటి
- లఘుచిత్రాల్లో రాణిస్తున్న పెంబట్ల, కోనాపూర్ యువత
వారు పల్లెటూరి పిల్లగాళ్లు. సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన యువకులు. నటనా రంగంపై ఆసక్తి ఉన్నా అవకాశాలు దొరకలేదు. అయినా నిరాశ చెందలేదు. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో షార్ట్‌ఫిల్మ్‌లు రూపొందిస్తున్నారు. పల్లెటూరి వాతావరణం, సామాజిక నేపథ్యం ఉన్న ఇతివృత్తాలతో చిత్రాలను నిర్మిస్తూ యూట్యూబ్ చానల్లో అప్లోడ్ చేస్తున్నారు.
సారంగాపూర్, అక్టోబర్ 28 : సారంగాపూర్ మం డలంలోని కోనాపూర్, పెంబట్ల గ్రామాలకు చెందిన తిరుకోవెల చంద్రం, తనుగుల చంద్రశేఖర్, దోసారపు రాజకమలాకర్ గౌడ్, తిరుకోవెల పూర్ణచందర్, బొడ్డుపెల్లి లక్ష్మణ్, సీలం మల్లేశ్, నిమిషకవి గంగాధర్, తిరుకోవెల ఆంజనేయులు, తిరుకోవెల సురేశ్, చింతకుంట శ్రీకాంత్, నరేందర్‌రావు, తిరుమల శ్రీనివాస్, విష్ణువర్దన్, బొమ్మకంటి ప్రమోద్, బొమ్మకంటి అన్వేష్, మీసాల రాజశేఖర్, ఈదుల లక్ష్మణ్‌కుమార్, దుగ్యాల మధుకర్ రావు, బాపురపు నిఖి ల్, తదితరులు కలిసి యూట్యూబ్ లఘు చిత్రాలను చితీక్రరిస్తున్నారు.
యువకుల ప్రతిభను పలువురు అభినందిస్తున్నారు. వీరు ఇప్పటివరకు 30 వీడియోలను యూట్యూబ్‌లో ఉంచారు. ఇందులో (చెల్లీ నీ రాకకై) అనే లఘు చిత్రం ప్రేక్షకాదరణ పొందింది. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న ఘటనలనే వీరు కథల రూపంలో లఘుచిత్రాలు తీసి యూట్యూబ్ లో పెడుతున్నారు. ఇప్పటిదాకా పెడుసు గాళ్లు, దోస్తా న్, బడిగంట, పిల్లలున్నారు జాగ్రత్త, ఉగాది, కాకా హోటల్, దావత్, ఆడికె బింకి, వెబ్ సిరీస్‌లాంటి లఘు చిత్రాలతోపాటుగా జానపదాలు, చైతన్య గీతా లు, దేశభక్తి గీతాలు, ప్రేమగీతాలు తదితర వీడియోలను చిత్రీకరించారు.

లఘు చిత్రంలో నటిస్తున్న యువకులు
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

