ప్రశాంత వాతావరణంలో సెస్ ఎన్నికలు ప్రారంభం
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సెస్ డైరెక్టర్ పోస్టులకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 15 మంది డైరెక్టర్లను ఎన్నుకునేందుకు 87 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జిల్లా వ్యాప్తంగా 202 పోలింగ్ బూతులను ఏర్పాటుచేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్న సెస్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. 15 మంది డైరెక్టర్లను ఎన్నుకునేందుకు పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఎన్నికల బరిలో మొత్తం 75 మంది ఉండగా.. 87,130 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 202 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనున్నది.
ప్రతిష్ఠాత్మక సెస్ ఎన్నికలు ఇవాళ జరుగుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్న సెస్‌లో వినియోగదారులకు అందుబాటులో ఉండి మరిన్ని సేవలు అందేలా చేసేందుకు డైరెక్టర్లను ఎన్నుకుంటారు. ఈ ఎన్నికల్లో సెస్‌లో నమోదై ఉన్న విద్యుత్ వినియోగదారులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు.
కాగా, వేములవాడ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో పోలింగ్ తీరును రాష్ట్ర కోఆపరేటివ్ ఎన్నికల అథారిటీ సుమిత్ర, సెస్ ఎన్నికల అధికారి మమత పరిశీలించారు. బూత్‌లోని సిబ్బందితో మాట్లాడి పోలీంగ్ సరళిని తెలుసుకున్నారు. సిరిసిల్ల శివనగర్‌లోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌ను జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పరిశీలించారు. పలు ప్రాంతాల్లో ఉదయం నుంచే వినియోగదారులు ఓటు వేసేందుకు బారులు తీరారు.

52 ఏండ్ల క్రితం సెస్‌ను అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే, గత పాలకులు సెస్‌ను పట్టించుకోకపోవడంతో కళ కోల్పోయింది. 2014 తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తన సహాయసహకారాలు అందజేయడం మొదలుపెట్టడంతో సెస్‌కు తిరిగి జీవం వచ్చింది. ప్రస్తుతం 2.72 లక్షల పైచిలుకు వినియోగదారులకు నిరంతరంగా నాణ్యమైన విద్యుత్ వెలుగులు అందిస్తున్నది.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

