అమరుల త్యాగం వెలకట్టలేనిది
తెలంగాణ పోరులో నేలకొరిగిన అమరుల త్యాగాలు వెలకట్టలేనివని రాష్ట్ర ప్రణాళికా సం ఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ కొనియాడారు. వారి బలిదానాలతోనే తెలంగాణ సిద్ధించిందని స్పష్టం చేశారు. ఉద్యమ నేత కేసీఆర్ నేతృత్వంలో మలిదశ ప్రత్యేక పోరా టం ప్రా రంభమైందన్నారు.
- కేసీఆర్ నేతృత్వంలోనే మలిదశ ఉద్యమం
- సకల జనులను ఏకం చేసి రాష్ర్టాన్ని సాధించారు
- తొమ్మిదేండ్ల పాలనలో అద్భుతాలు సృష్టించారు
- తెలంగాణ కోసం ప్రతి కుటుంబం పోరాడింది
- రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్
- అమరుల కుటుంబాలకు ఘన సన్మానం
రాజన్న సిరిసిల్ల, జూన్ 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పోరులో నేలకొరిగిన అమరుల త్యాగాలు వెలకట్టలేనివని రాష్ట్ర ప్రణాళికా సం ఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ కొనియాడారు. వారి బలిదానాలతోనే తెలంగాణ సిద్ధించిందని స్పష్టం చేశారు. ఉద్యమ నేత కేసీఆర్ నేతృత్వంలో మలిదశ ప్రత్యేక పోరా టం ప్రా రంభమైందన్నారు. ఆయన ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పదవులను తృణప్రాయంగా త్యజించి ఉద్యమంలోకి అడుగుపెట్టారని గుర్తుచేశారు. అప్పటి నాయకులు ఇది అయ్యేదా? పొయ్యేదా? అంటూ వెక్కిరించారని, అయినా పట్టు విడువకుండా సకల జనులను ఏకం చేసి ప్రాణాలను పణంగా పెట్టి రాష్ర్టాన్ని సాధించారని పేర్కొన్నారు.
తెలంగాణ కోసం ప్రతి కుటుంబం పోరాట పటిమను చూపిందని చెప్పారు. తెలంగా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం సిరిసిల్ల పాత బస్టాండ్ వద్ద అమరవీరుల స్తూపానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం సమీకృత కలెక్టరేట్లో 30 మంది అమరుల కుటుంబాలను సన్మానించారు. వారితో సహపంక్తి భోజనం చేశారు. ఆయాచోట్ల వినోద్ మాట్లాడుతూ, ఉద్య మ నేపథ్యాన్ని వివరించారు. 1956లో ఢిల్లీ పెద్దలు తెలంగాణను బలవంతంగా ఆంధ్రాప్రాంతంలో కలిపినప్పుడే ప్రజల్లో ప్రత్యేక ఆకాంక్ష చిగురించిందని చెప్పారు. అంతకుముందే తెలంగాణ ప్రజలు పెత్తందారులకు వ్యతిరేకంగా ఉద్యమించారన్నారు. నిజాం రాచరిక పాలననుంచి విముక్తి కోసం తిరగబడ్డారని గుర్తు చేశారు. ఇందులో సిరిసిల్ల ప్రాంతానికి ప్రత్యే చరిత్ర ఉన్నదన్నారు. ఇక్క డి ప్రజలు పోరాటంలో ముందునిలిచారని చె ప్పా రు.
జిల్లా ప్రజలు చేసిన పోరాటం గురించి మన పెద్దలు కథలు కథలుగా చెబుతారన్నారు. గత చరి త్ర తెలుసుకున్న వాడే భవిష్యత్‌ను నిర్మిస్తాడని పేర్కొన్నారు. ఇదే కోవలో కేసీఆర్ చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడే తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదరిరించారన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో జరుగుతున్న అన్యాయాన్ని ప్రతి వేదికపైనుంచి ప్రశ్నించారని నెమరేసుకున్నారు. తెలంగాణ పోరాటంలో ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోవద్దని భావించి శాంతియుతంగా ఉద్యమించారని చెప్పారు. 2009 డిసెంబర్ వరకు ఒకరు కూడా పోరాటంలో ప్రాణాలు కోల్పోలేదన్నారు.
2009 డిసెంబర్9న కేంద్రం తెలంగాణ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసి, ఆ వెంటనే వెనక్కి తీసుకోవడంతోరాష్ట్రం రా దేమోననే దిగులుతో యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం సిద్ధించిన తర్వాత తొమ్మిదేండ్లలో అమరుల ఆశయాలే స్ఫూర్తిగా, ప్రజల ఆత్మగౌరవ ఆకాంక్షలే ఊపిరిగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని కొనియాడారు. రాత్రింబవళ్లు శ్రమించి రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపారని చెప్పారు. రానున్న రోజుల్లో దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతారని పేర్కొన్నారు. మానకొండూర్ ఎమ్మెల్యే ర సమయి బాలకిషన్ మాట్లాడుతూ అమరుల త్యా గాలతో సాధించుకున్న రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్ నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, వైస్‌చైర్మన్ సిద్ధ్దం వేణు, కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజ న్, అదనపు కలెక్టర్లు సత్యప్రసాద్ ఖీమ్యా నా య క్, ఆర్డీవో శ్రీనివాసరావు, బల్దియా చైర్ పర్సన్ జిందం కళ, వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, ఆర్బీఎస్ కోఆర్డినేటర్ గడ్డం నర్సయ్య ఉన్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NHM Employees | డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
HDFC Bank: విశ్వసనీయ సమాచారాన్ని లీక్ చేసిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు
బైక్ అదుపుతప్పి యువకుడు మృతి
Dhamma Parivartan Divas | ఆదిలాబాద్ జిల్లాలోని దళితవాడల్లో ఘనంగా దమ్మ పరివర్తన్ దివస్
Zumba | జుంబా, పైలేట్స్, హెచ్ఐఐటీ.. గుండెకు ఏ వ్యాయామం మంచిది?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

