G Kishan Reddy | నాణ్యత ప్రమాణాలు పెంచి వినియోగదారులను నిలుపుకోవాలి
రానున్న రోజుల్లో ఇంధన రంగంలో స్వయం సమృద్ధిని సాధించే విషయంలో ప్రభుత్వ బొగ్గు సంస్థలు డిమాండ్‌కు తగినట్టుగా నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేసేలా సమాయత్తపరిచేందుకు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నడుం కట్టింది.
- నూతన గనులను సాధించుకోవడానికి కృషి చేయాలి
- పని సంస్కృతిలో మార్పునకు కార్మిక సంఘాల సహకారం తీసుకోవాలి
- కోలిండియా, సింగరేణి పై కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ కీలక సమీక్ష
- పాల్గొన్న కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, బొగ్గు శాఖ కార్యదర్శి విక్రమ్ దేవ్ దత్
G Kishan Reddy | గోదావరిఖని :రానున్న రోజుల్లో ఇంధన రంగంలో స్వయం సమృద్ధిని సాధించే విషయంలో ప్రభుత్వ బొగ్గు సంస్థలు డిమాండ్‌కు తగినట్టుగా నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేసేలా సమాయత్తపరిచేందుకు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నడుం కట్టింది. ఇందులో భాగంగా కోలిండియా సహా సింగరేణిపై కీలక సమీక్ష సమావేశాన్ని నిర్వహించింది. ఇందులో బొగ్గు ఉత్పత్తి వ్యయం తగ్గింపు, నాణ్యత, సరఫరా తదితర అంశాల్లో ఎదురవుతున్న సవాళ్లు, వాటిపై తీసుకోవాల్సిన చర్యలపై కీలక దిశా నిర్దేశం చేసింది.
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అధ్యక్షతన ఢిల్లీ నుంచి జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో బొగ్గు శాఖ కార్యదర్శి విక్రమ్ దేవ్ దత్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగరేణి తరఫున సంస్థ ఛైర్మన్, ఎండీ ఎన్.బలరామ్ హైదరాబాద్ సింగరేణి భవన్ నుండి ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఎన్ బలరామ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సింగరేణి సంస్థ ప్రగతి, భవిష్యత్తు ప్రణాళికలు తదితర అంశాలపై కూలంకశంగా వివరించారు.
ఈ సందర్భంగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ కార్మికుల జీతాలు, సంక్షేమ కార్యక్రమాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బొగ్గు ఉత్పత్తి ఖర్చు గణనీయంగా తగ్గించాలన్నారు. ఇందుకోసం కార్మిక సంఘాల సహకారాన్ని తీసుకోవాలని, పని సంస్కృతి మెరుగుపరచాలని సూచించారు. అలాగే ఉత్పత్తి ఖర్చు తగ్గింపునకు సింగరేణి అధికారులు, బొగ్గు మంత్రిత్వ శాఖ నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలన్నారు.
ఈ కమిటీ ప్రత్యక్షంగా క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతుందని, కమిటీ చేసే ఆచరణాత్మక సూచనలను వెంటనే అమలు జరిపి ఉత్పత్తి ఖర్చును తగ్గించాలని సూచించారు. వినియోగదారులు సింగరేణి సంస్థకు దూరం కాకుండా ఉండాలంటే నాణ్యతపై కూడా గట్టి దృష్టి పెట్టాలన్నారు. బొగ్గు శాఖ కార్యదర్శి విక్రమ్ దేవ్ దత్ మాట్లాడుతూ బొగ్గు సంస్థల మనుగడకు కొత్త గనులను పెంచుకోవడం అత్యంత అవసరమని, అలాగే ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడం ద్వారా వినియోగదారులకు బొగ్గు ధర అందుబాటులోకి తీసుకురావొచ్చని, దీంతో అంతిమంగా విద్యుత్ ఉత్పత్తి వ్యయం కూడా తగ్గి ప్రజలకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో ఆయన కోల్ ఇండియా గనులతో పాటు సింగరేణి గనుల పనితీరును, సంక్షేమ కార్యక్రమాలను సమీక్షించారు. సంస్థ డైరెక్టర్లు డి.సత్యనారాయణ రావు(ఈ అండ్ ఎం), ఎల్వీ సూర్యనారాయణ రావు (ఆపరేషన్స్), కె.వేంకటేశ్వర్లు (పి అండ్ పి, పా), ఈడీ ఎస్డీఎం.సుభాని తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్‌తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
Ranabaali | ‘రణబాలి’ ఫస్ట్ డే కలెక్షన్స్.. విజయ్ దేవరకొండకు ఈ చిత్రంతోను నిరాశేనా ..!
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

