కమాన్‌చౌరస్తా, అక్టోబర్ 18 : శాతవాహన యూనివర్సిటీ వైస్ చా న్స్లర్గా ఉస్మానియా యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగం విశ్రాంత సీనియర్ ప్రొఫెసర్, ఎస్‌యూలో నాడు రిజిస్ట్రార్‌గా పనిచేసిన యూ ఉమేశ్‌కుమార్‌ను నియమిస్తూ శుక్రవారం గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట. 28ఏళ్ల బోధ న అనుభవంతోపాటు 20 ఏళ్ల పరిశోధన అనుభవంతో ఉమేశ్‌కుమార్ మంచి గుర్తింపు పొందారు. ఈ క్ర మంలో శనివారం శాతవాహన యూనివర్సిటీలో బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తున్నది.
ఉమేశ్ కుమార్ 2015లో మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఇన్చార్జి వై స్ చాన్సలర్‌గా, రిజిస్ట్రార్‌గా పనిచేశారు. ఆ తర్వాత రిజిస్ట్రార్‌గా నల్గొండ ఎంజీ యూనివర్సిటీలో మూడేళ్లు, శాతవాహన లో రెండేళ్లు విధులు ని ర్వర్తించారు. వివిధ జాతీయ, అంతర్జాతీ య పత్రికల్లో ఆయన రాసిన 36 కథనాలు ప్రచురితమయ్యాయి. ఆయన మార్గదర్శకత్వంలో తొమ్మిది మంది పరిశోధకులు పీహెచ్డీ పొందారు. మరో విద్యార్థి పీహెచ్డీ కో సం పనిచేస్తున్నారు.
కాగా, ఉమేశ్‌కుమార్ ఆంధ్రప్రదేశ్‌లోని సెంట్రల్ యూనివర్సిటీకి ఈసీ సభ్యుడిగా, హర్యానాలోని భివానీలోని దరీ బన్సీలాల్ విశ్వవిద్యాలయానికి గవర్నర్ నామినీగా బాధ్యతలు నిర్వర్తించా రు. పాలమూరు యూనివర్సిటీలో డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్‌గా సైతం పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ లో వివిధ అడ్మినిస్ట్రేటివ్, అకాడమిక్ పదవులు చేపట్టారు. బిక్నూర్ యూ త్ వెల్ఫేర్ ఆఫీసర్, స్టూడెంట్స్ అఫైర్స్ ఉస్మానియా యూనివర్సిటీ, జా యింట్ డైరెక్టర్, డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్, ఉస్మానియా యూనివర్సిటీ, చైర్మన్, బీవోఎస్, హెడ్ డిపార్ట్మెం ట్ ఆఫ్ కెమిస్ట్రీ, ఉస్మానియా యూనివర్సిటీలో విధులు నిర్వహించి ఉద్యో గ విరమణ పొందారు.
ఉమేశ్‌కుమార్ 2017 నుంచి 2019 వరకు శాతవాహన యూనివర్సిటీలో రిజిస్ట్రార్‌గా బాధ్యతలు నిర్వర్తించి, తనదైన ముద్ర వేసుకున్నారు. యూనివర్సిటీ వీసీ చిరంజీవులు, ఆయన రిజిస్ట్రార్‌గా ఉన్న కాలంలో శాతవాహన స్నాతకోత్సవాన్ని నిర్వహించిన ఘనత దక్కింది. యూనివర్సిటీలో సీసీ కెమెరాల ఏర్పాటుతోపాటు, సెక్యూరిటీ, సుందరీకరణ పనులు చేపట్టారు.