Video Album | కోల్ సిటీ, జూన్ 18 : కరోనా క్రియేషన్స్ సమర్పణలో ప్రముఖ యూట్యూబ్ స్టార్, గోదావరిఖనికి చెందిన సీనియర్ కళాకారుడు వేముల అశోక్ నిర్మాణంలో ‘ప్రియుడి మోజులో భార్య.. కుప్పకూలిన భర్త’ టైటిల్‌తో తెరకెక్కిస్తున్న వీడియో ఆల్బమ్ షూటింగ్‌ను బుధవారం గోదావరిఖనిలో ప్రారంభించారు. ప్రముఖ వ్యాపారవేత్త గుర్రం శ్రీనివాస్ – దుర్గ భవాని దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై కెమెరా స్విచ్ ఆన్ చేసి క్లాప్ కొట్టి ప్రారంభించారు.
ఈ సందర్భంగా గుర్రం శ్రీనివాస్ మాట్లాడుతూ.. నేటి సమాజంలో అక్కడక్కడ జరుగుతున్న సంఘటనల ఇతివృత్తంగా నిర్మాత, దర్శకుడు వేముల అశోక్ కండ్లకు కట్టినట్లుగా చూపిస్తూ సమాజంలో కొంతవరకైనా మార్పు తీసుకురావాలన్న ప్రయత్నం ఫలించాలని కోరారు. ఇందులో వేముల అశోక్, మానస, అంగడి రమేష్ లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
విజయ్ నగనూరి దర్శకత్వంలో వస్తోన్న వీడియో ఆల్బమ్ చిత్రీకరణలో కెమెరామెన్ శివ, ప్రొడక్షన్ మేనేజర్ కోల్లూరి ప్రసాద్, హీరోయిన్, కాస్టింగ్ ఎస్ఎస్ క్యాస్టింగ్ క్లబ్ శ్రీను శ్రీకాకుళం, మేకప్ ఆర్టిస్ట్ టి అంజిబాబు, మేకప్ అసిస్టెంట్ లక్ష్మణ్, దామెర రాజేష్, లింగన్న, అనిల్ , జ్ఞాని ఫిరోజ్, సహదేవ్ తదితరులు పాల్గొన్నారు.
Chiranjeevi | డ్రిల్ మాస్టర్ శివశంకర్‌గా చిరంజీవి.. కామెడీకి పొట్ట చెక్కలవ్వాల్సిందే..!
Jogulamba Gadwal | గద్వాలలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అరెస్ట్