కరీంనగర్ : పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ముఖ్యమంత్రి ఇంటి ముట్టడికి పిలుపునిచ్చిన మాజీ సర్పంచులను పోలీసులు అరెస్ట్ చేశారు. సర్పంచ్ల సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ వెళ్లేందుకు ప్రయత్నించిన మాజీ సర్పంచులను కరీంనగర్ జిల్లాలో ఎక్కడికి అక్కడ ముందస్తుగా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెండింగ్ బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం ఇబ్బందులు పెడుతున్నదని ఆరోపించారు. అప్పులు చేసి గ్రామాలను అభివృద్ధి చేస్తే బిల్లులు విడుదల చేయాలని కోరడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు.