Indiramma saree | దేవతామూర్తులకూ రాజకీయ రంగులా..? .. గోదావరి మాతకు ఇందిరమ్మ చీర అలంకరణ
ఆధ్యాత్మిక క్షేత్రాల్లోనూ రాజకీయ ప్రచారానికి తెరలేపుతున్నారా..? దేవతామూర్తులకు సైతం రాజకీయ రంగులు పులమడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు ధర్మపురిలో చర్చనీయాంశంగా మారాయి. గోదావరి నది తీరంలోని గోదావరి మాత ఆలయంలో అమ్మవారికి ఇందిరమ్మ చీరతో అలంకరణ చేయడంపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
- బీఆర్ఎస్ నేతల అభ్యంతరం
- సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ ఆగ్రహం
- ఘటనపై సమగ్ర విచారణకు డిమాండ్

Indiramma saree | ధర్మపురి, నవంబర్ 20 : ఆధ్యాత్మిక క్షేత్రాల్లోనూ రాజకీయ ప్రచారానికి తెరలేపుతున్నారా..? దేవతామూర్తులకు సైతం రాజకీయ రంగులు పులమడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు ధర్మపురిలో చర్చనీయాంశంగా మారాయి. గోదావరి నది తీరంలోని గోదావరి మాత ఆలయంలో అమ్మవారికి ఇందిరమ్మ చీరతో అలంకరణ చేయడంపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆలయ పవిత్రత, సంప్రదాయాలు, ఆచారాలను పక్కనపెట్టి రాజకీయ కార్యక్రమాలకు దేవతామూర్తులను వేదికగా మార్చడం సరికాదని వారు విమర్శించారు. ఈ వ్యవహారంపై ఆలయ అధికారులు స్పష్టమైన వివరణ ఇవ్వడంతో పాటు సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ధర్మపురి పట్టణంలోని గోదావరి నది తీరాన ఉన్న గోదావరి మాత ఆలయాన్ని బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు.
ఈ సందర్భంగా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, బీఆర్ఎస్ మండల కన్వీనర్ అయ్యోరి రాజేష్ కుమార్ మాట్లాడుతూ కోట్లాది రూపాయల ఆదాయం కలిగిన ధర్మపురి దేవస్థానంలో అమ్మవారికి సంప్రదాయబద్ధమైన చీర సమర్పించేందుకు నిధులు లేవా..? ఇందిరమ్మ చీరతోనే అలంకరించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ప్రభుత్వ పథకాల ప్రచారానికి దేవతామూర్తులను ఉపయోగించుకోవడం తగదన్నారు. అమ్మవారి అలంకరణ విషయంలో ఆలయ ఆచారాలు, సంప్రదాయాలు, భక్తుల మనోభావాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఆలయ ఈవో వివరణ ఇవ్వాలని, చీర సమర్పణ వెనుక ఉన్న పరిస్థితులపై విచారణ జరిపించాలని కోరారు.
ఒకవైపు గోదావరి మాత ఆలయ అలంకరణ వివాదం కొనసాగుతుండగా, మరోవైపు కార్తీక మాసంలో పుణ్యస్నానాల కోసం ధర్మపురికి వస్తున్న భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. వేలాది మంది భక్తులు నిత్యం గోదావరి తీరానికి వస్తున్నప్పటికీ మహిళలకు దుస్తులు మార్చుకునేందుకు తగిన ఏర్పాట్లు చేయలేదన్నారు. తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేయకపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా బాత్రూమ్ల వద్ద గత పది రోజులుగా మోటార్ పనిచేయకపోవడంతో నీటి సమస్య నెలకొందని, సంబంధిత అధికారులు కనీస మరమ్మతులు కూడా చేపట్టకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. భక్తుల రద్దీని ముందుగానే అంచనా వేసి అవసరమైన సౌకర్యాలు కల్పించాల్సిన యంత్రాంగం, సమస్యలు వెలుగులోకి వచ్చినా స్పందించకపోవడం విచారకరమన్నారు.
స్వచ్ఛ గోదావరి ప్రకటనలకే పరిమితమా..?
గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచేందుకు స్వచ్ఛ గోదావరి పేరుతో ప్రకటనలు చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని నాయకులు విమర్శించారు. నది పరిసరాల్లో చెత్తాచెదారం, పాత దేవుళ్ల చిత్రాలు ఇతర పూజా సామగ్రి పేరుకుపోయి అపరిశుభ్ర వాతావరణం నెలకొందన్నారు. పవిత్రమైన గోదావరి తీరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, నదిలోకి వ్యర్థాలు చేరకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసాలకు అనుగుణంగా నదీ తీరాన్ని పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని కోరారు.
కార్తీక పౌర్ణమికి మరో నాలుగు రోజులే సమయం ఉండటంతో ధర్మపురికి భక్తుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉందని నాయకులు తెలిపారు. అయినప్పటికీ ఇప్పటివరకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు కనిపించడం లేదని విమర్శించారు. తాగునీరు, మరుగుదొడ్లు, మహిళలకు దుస్తులు మార్చుకునే గదులు, స్నానఘట్టాల వద్ద భద్రత, పారిశుద్ధ్య నిర్వహణ వంటి కనీస సౌకర్యాలను వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు.
కార్తీక మాసంలోనే భక్తులకు కనీస వసతులు కల్పించలేని అధికారులు, రాబోయే గోదావరి పుష్కరాల సమయంలో లక్షలాది మంది భక్తుల రాకను ఎలా తట్టుకుంటారని ప్రశ్నించారు. పుష్కరాల పేరుతో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెబుతున్న పాలకులు, ప్రస్తుతం భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎందుకు దృష్టి సారించడం లేదని నిలదీశారు. పుష్కరాల ఏర్పాట్లు కేవలం ప్రకటనలు, ప్రతిపాదనలకే పరిమితం కాకుండా ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.
మంత్రి వెంటనే స్పందించాలి
ధర్మపురి ఎమ్మెల్యే, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈ వ్యవహారంపై తక్షణమే స్పందించాలని బీఆర్ఎస్ నాయకులు కోరారు. గోదావరి మాత ఆలయంలో జరిగిన అలంకరణ వ్యవహారంపై విచారణ జరిపించి వాస్తవాలను వెల్లడించాలని, బాధ్యతారాహిత్యం లేదా నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదే విధంగా దేవస్థానం, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ గోదావరి తీరంలో భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ధర్మపురి కేవలం ఒక పట్టణం మాత్రమే కాదని, వేలాది మంది భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా నిలిచిన పుణ్యక్షేత్రమని పేర్కొంటూ, ఆలయ పవిత్రతను కాపాడటం, గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచడం, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం పాలకులు, అధికారుల ప్రాథమిక బాధ్యత అని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ కన్వీనర్ బండారి రంజిత్, సీనియర్ నాయకులు సంగి శేఖర్, చిలువేరి శ్యామ్ సుందర్, పెరుమాండ్ల ఎల్లగౌడ్, చిర్నెని నర్సయ్య, చుక్క రవి, బండారి అశోక్, తరాల కార్తీక్, స్తంభంకాడి మహేష్, నక్క రాజేందర్, చీపిరిశెట్టి రాజన్న, మోలుగూరి రాజన్న, జెట్టి రాజన్న, ఆనందాసు శ్రీనివాస్, కనుకుల స్వామి, కాశెట్టి విజయ్, కాళ్ల జగన్, సిర్ప బద్రీనాథ్, మూటపెల్లి లడ్డు, కళ్లెం రిషి రెడ్డి, మోలుగూరి ప్రశాంత్, నూనె సాయి, మూటపెల్లి రాహుల్, చుక్క పవన్, చల్ల మున్నా తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DK Shivakumar | మాకే తాగడానికి నీళ్లు లేవు, మికేలా ఇస్తాం.. సీఎం డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు
Avinash Reddy Arrest | కడప వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్..విడుదల
January 12 Vidudala | ‘జనవరి 12 విడుదల’ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్.. ‘దివికి దివికి’ ప్రోమో విడుదల!
VishwakSen | సంస్కారం వయసుతో పాటు పెరగాలి.. సీనియర్ జర్నలిస్ట్ వ్యాఖ్యలపై విశ్వక్ సేన్ ఫైర్!
Liver Detox | లివర్‌ను క్లీన్ చేస్తాయని చెప్పే చిట్కాలు, ఉత్పత్తులను నమ్మవచ్చా.. కాఫీ ప్రభావం లివర్‌పై ఉంటుందా..?
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

