దోపిడీ దొంగల అరెస్ట్
నగరంలోని కట్టరాంపూర్ ప్రాంతంలో ఈ నెల 15న తెల్లవారుజామున నాలుగు గంటలకు ద్విచక్ర వాహనదారుడిని వెంబడించి దోపిడీకి పాల్పడిన ఇద్దరు నిందితులను వన్‌టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
- నిందితులిద్దరూ విద్యార్థులే
రాంనగర్, జూలై 23: నగరంలోని కట్టరాంపూర్ ప్రాంతంలో ఈ నెల 15న తెల్లవారుజామున నాలుగు గంటలకు ద్విచక్ర వాహనదారుడిని వెంబడించి దోపిడీకి పాల్పడిన ఇద్దరు నిందితులను వన్‌టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన నిందితులు ఇద్దరూ విద్యార్థులేనని ఏసీపీ నరేందర్ మీడియాకు వెల్లడించారు. ఈ నెల 15న కట్టరాంపూర్ ప్రాంతంలో బోనాల పండుగకు వెళ్లి ద్విచక్రవాహనంపై వస్తున్న పిట్టల సుమంత్ తిరుమల నగర్ చేరుకునేసరికి యాక్టివా ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు అతడి మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసు లాకొని పరారయ్యారు.
ఈ ఘటనలో బాధితుడు సుమంత్ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేయడంతోపాటు నాలుగు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పరిసర ప్రాంతాల్లో గల సీసీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలించి నిందితులను గుర్తించారు.
ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఉజ్వల పార్ సమీపంలో చేపట్టిన వాహన తనిఖీల్లో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించగా, అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా బంగారు గొలుసు లభ్యమైంది. దానిని దోపిడీకి పాల్పడిన సొత్తుగా అంగీకరించారు. సదరు వ్యక్తులను హైదరాబాద్ హకీంపేట చెందిన బీటెక్ విద్యార్థి మహ్మద్ ఫైజాన్, మానకొండూర్‌కు చెందిన షేక్ సాహిద్గా గుర్తించారు.
నిందితులను అదుపులోకి తీసుకొని వారి నుంచి ద్విచక్ర వాహనం, రెండున్నర తులాల బంగారు గొలుసును స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరు పరచనున్నట్లు ఏసీసీ తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో శ్రమించిన వన్ టౌన్ సిబ్బంది బషీర్, కుమారస్వామికి ఏసీపీ నగదు రివార్డు అందజేసి అభినందించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

