Vemulawada | రాజన్న ఆలయం వద్ద జూదంతో భక్తుల నిలువు దోపిడీ.. అమాయక భక్తులే టార్గెట్
వేములవాడ రాజన్న ఆలయానికి దర్శనానికి వచ్చిన భక్తుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. అమాయక భక్తులను టార్గెట్ చేసుకొని అందిన కాడికి జూదం పేరుతో ఓ ముఠా దండుకుంటుంది. టార్గెట్ పూర్తి చేసుకున్నాక అక్కడి నుంచి జారుకుని మరోచోట జూదం నిర్వహిస్తూ వేలాది రూపాయలను కొల్లగొడుతున్న కనీస పర్యవేక్షణ లేకపోవడం అనుమానాలకు తావిస్తుంది.
- అందిన కాడికి దండుకుంటున్న ముఠా..?
Vemulawada | వేములవాడ, జూన్ 21: వేములవాడ రాజన్న ఆలయానికి దర్శనానికి వచ్చిన భక్తుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. అమాయక భక్తులను టార్గెట్ చేసుకొని అందిన కాడికి జూదం పేరుతో ఓ ముఠా దండుకుంటుంది. టార్గెట్ పూర్తి చేసుకున్నాక అక్కడి నుంచి జారుకుని మరోచోట జూదం నిర్వహిస్తూ వేలాది రూపాయలను కొల్లగొడుతున్న కనీస పర్యవేక్షణ లేకపోవడం అనుమానాలకు తావిస్తుంది. ఇక శనివారం రాత్రి వరంగల్ జిల్లా నుండి కుటుంబం స్వామి వారిని దర్శించుకునేందుకు వేములవాడకు వచ్చారు. ఆదివారం స్వామివారిని దర్శించుకున్నాక కుటుంబ సభ్యుల్లోని ఒకరు గుడి చెరువు పార్కింగ్ స్థలంలో నిర్వహిస్తున్న ఆటల వైపు వెళ్లాడు.
అయితే ఇక్కడ రంగురంగుల బిల్లలతో జూదం నిర్వహిస్తున్నారు. ఇక భక్తుల రద్దీగా ఉండే ఆది సోమవారాలలో జాతర గ్రౌండ్, ఓపెన్ పార్కింగ్ స్థలం ప్రాంతాలలో రంగు బిళ్ళల మీద జూదం జరుగుతోంది. బిళ్ళ మీద ఎంత పెడితే ఆ బిళ్ళ వస్తే అంతకు నగదు రెట్టింపు ఇస్తూ వారిని వలలో వేసుకుంటున్నారు. 100 రూపాయలతో మొదలైన ఆట 5వేల రూపాయల వరకు చేరుతుండగా మోసానికి పాల్పడుతూ అందిన కాడికి దండుకుంటున్నారు. ఇదే తరహాలో ఆట ఆడుతూ ఏకంగా ఓ వ్యక్తి సుమారు రూ.5వేలు పోగొట్టుకున్నాడు. దీంతో నగదు పోయిన విషయం కుటుంబ సభ్యులు గమనించి అక్కడికి చేరుకొని నిర్వాహకులతో గొడవకు దిగారు.
ఇరువురు మధ్య వాగ్వాదం తీవ్ర రూపం దాల్చడంతో భక్తులు పెద్ద ఎత్తున భూమి కూడా గా నిర్వాహకులు సదరు నగదు పోగొట్టుకున్న కుటుంబానికి కొంత నగదు ఇచ్చి అక్కడ నుంచి జారుకున్నారు. అమాయక భక్తులను టార్గెట్ చేసుకొని పెద్ద ఎత్తున నగదు దోపిడికి బాధపడుతున్న జూదం వ్యవహారంపై పోలీస్ యంత్రాంగం దృష్టి సారించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

