Godavarikhani | ఇంకుడుగుంత నిర్మిస్తేనే ఇంటికి అనుమతి.. రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి
రామగుండం నగర పాలక పరిధిలో ఇకపై ఇంకుడుగుంతలు నిర్మించుకుంటేనే కొత్త ఇంటికి అనుమతి ఇస్తామనీ, డిసెంబర్ నుంచి ఇళ్ల వద్ద బోర్ల నిర్మాణాలను పూర్తిగా నిషేధిస్తున్నామని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి ప్రకటించారు.
- డిసెంబర్ నుంచి బోర్ల నిర్మాణాలు నిషేధం విధిస్తామని హెచ్చరిక
Godavarikhani | కోల్ సిటీ, నవంబర్ 28 : రామగుండం నగర పాలక పరిధిలో ఇకపై ఇంకుడుగుంతలు నిర్మించుకుంటేనే కొత్త ఇంటికి అనుమతి ఇస్తామనీ, డిసెంబర్ నుంచి ఇళ్ల వద్ద బోర్ల నిర్మాణాలను పూర్తిగా నిషేధిస్తున్నామని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి ప్రకటించారు. నగర పాలక కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల ముంబయిలో జరిగిన వర్క్ షాపులో 30 దేశాల నుంచి వచ్చిన నిపుణుల నుంచి నగర అభివృద్ధికి కొత్త విషయాలు నేర్చుకున్నామని తెలిపారు. వర్క్ షాపు లో జరిగిన అంశాలను వివరించిన మేయర్ వాటిని రామగుండంలో అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు. ముఖ్యంగా ఎల్ నినో ప్రభావంను అధిగమించేందుకు ప్రజలు ఇప్పటి నుంచే నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. నగరంలో లీకేజీలను అరికట్టడంతోపాటు వారం రోజుల్లో కమిషనర్ తో కలిసి ఇంటింటికి ఆకస్మిక తనిఖీలు చేస్తామనీ, ఆన్ ఆఫ్ లాక్ లేని నల్లా కనెక్షన్లకు జరిమానాతోపాటు కనెక్షన్ తొలగించనున్నట్లు తెలిపారు.
ఇకపై ఇంకుడుగుంతలు నిర్మించుకుంటేనే ఇంటి నిర్మాణాలకు అనుమతులు ఉంటాయని స్పష్టం చేశారు. బహుళ అంతస్థుల వద్ద కూడా ఇంకుడుగుంతలు తప్పనిసరి అని పేర్కొన్నారు. వివిధ పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యంను అరికట్టేందుకు అర్బన్ ఫారెస్ట్రీని అమలు చేస్తామనీ, నగరంలో విరివిగా చెట్ల పెంపకం చేపడుతామన్నారు. కూల్ రూప్ ప్లాన్ కూడా అమలు చేస్తామన్నారు. చెత్త రీ సైక్లింగ్ విధానంను పకడ్బందీగా అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. రాబోయే పుష్కరాల లోపు నది తీర ప్రాంత అభివృద్ధికి విధి విధానాలు ఖరారు చేస్తామన్నారు. రామగుండం కార్పొరేషన్లో కృత్రిమ మేధ సాంకేతిక పరిజ్ఞానంతో స్మార్ట్ పరిపాలన తీసుకొస్తున్నట్లు తెలిపారు. మురుగునీటిని శుద్ధి చేసి వినియోగంలోకి తీసుకవచ్చేలా స్థానిక పరిశ్రమల అధికారులను సంప్రదించి తగిన చర్యలకు ఆదేశిస్తామని తెలిపారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ ఎల్లయ్య, కార్పొరేటర్లు ఎండీ ముస్తఫా, గట్ల రమేష్, సతీష్, రవి, డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, టౌన్ ప్లానింగ్ అధికారి నవీన్, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR Deeksha Divas | ఆస్ట్రేలియాలో ఘనంగా కేసీఆర్-దీక్షా దివస్.. ఉద్యమ స్పూర్తిని చాటిన ప్రవాస తెలంగాణ బిడ్డలు
నల్లగొండను బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి : కలెక్టర్ చంద్రశేఖర్
Deeksha Divas | దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి : మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునిత
Health tips | ఆ ఆరోగ్య సమస్యలకు పుదీనాతో చక్కటి పరిష్కారం.. తెలుసా..?
దీపం వెలిగించి వెళ్లిన కొద్దిసేపటికే అగ్నికి ఆహుతైన ఇల్లు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

