Peddapalli | పట్టాలు దాటుతుండగా ఢీకొట్టిన రైలు.. గుర్తు తెలియని మహిళ మృతి
పెద్దపల్లి మండలంలోని కొత్తపల్లిలో రైలు ఢీకొని గుర్తు తెలియని మహిళ మృతిచెందింది. సుమారు 55-60 ఏండ్ల వయస్సు గల మహిళ మృతదేహాన్ని కనుగొన్నట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలిపారు.
పెద్దపల్లి రూరల్, జూన్ 21: పెద్దపల్లి మండలంలోని కొత్తపల్లిలో రైలు ఢీకొని గుర్తు తెలియని మహిళ మృతిచెందింది. సుమారు 55-60 ఏండ్ల వయస్సు గల మహిళ మృతదేహాన్ని కనుగొన్నట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలిపారు. కొత్తపల్లిలో మూసి వేసి ఉన్న కొత్తపల్లి రైల్వే గేట్ వద్ద పట్టాలు దాటుతుండగా దూరంతో ఎక్స్ ప్రెస్ రైలు ఆమెను ఢీకొట్టిందని చెప్పారు. దీంతో శరీరం ముక్కలైందని, కాళ్ల భాగం రైలు పట్టాలపై పడి ఉండగా, తల భాగం ట్రైన్ ఇంజన్ ముందు భాగంలో ఇరుక్కోగా కాజిపేట రైల్వేస్టేషన్లో గమనించి తల భాగాన్ని బయటకు తీశారన్నారు.
మృతురాలి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు గాని, వస్తువులు గాని లేవని తెలిపారు. రైలు పట్టాలపై పడిఉన్న శరీర భాగలను తీసుకుని వెళ్లి మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం దవాఖానలోని మార్చరీలో భద్రపర్చామని వెల్లడించారు. ఈఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు ఫోన్ నంబర్ 9949304574, 8712658604కి సమాచారం అందించాలని కోరారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

