గోదావరిఖని ప్రభుత్వ దవాఖానలో ఆర్టీపీసీఆర్ ల్యాబ్ ఏర్పాటు
ఒక్క రోజులోనే రిపోర్ట్
రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి
గోదావరిఖని, ఆగస్టు 25: సర్కారు దవాఖాలను కార్పొరేట్ స్థాయిలో అందుబాటులోకి తెచ్చి ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు కృషి చేస్తున్నామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ స్పష్టం చేశారు. గోదావరిఖని ప్రభుత్వ దవాఖానలో బుధవారం రూ.కోటీ 20 లక్షలతో ఏర్పాటు చేసిన ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం ల్యాబ్‌లో పరికరాల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని ప్రజల ఆరోగ్య రక్షణే తమ లక్ష్యమన్నారు. కరోనా పూర్తి స్థాయి వ్యాధి నిర్ధారణ కోసం ఆర్టీపీసీఆర్ టెస్టు అవసరమనీ, జిల్లా కేంద్రంలో కూడా ఆర్టీపీసీఆర్ టెస్టు అం దుబాటులో లేకపోవడంతో ప్రత్యేకంగా సీఎం కేసీఆర్‌కు విన్నవించి గోదావరిఖని దవాఖానలో ఈ ల్యాబ్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఈ ల్యాబ్‌లో ఉదయం శాంపిల్ ఇస్తే సాయంత్రం వరకు పూర్తి స్థాయి రిపోర్టు వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ డాక్టర్ అనిల్‌కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక రావు, కార్పొరేటర్లు పెంట రాజేశ్, సాగంటి శంకర్, అడ్డాల గట్టయ్య, కృష్ణవేణి, రాజ్‌కుమార్, నాయకులు రాకం వేణు, కాల్వ శ్రీనివాస్, మధుకర్ రెడ్డి, గోలివాడ ప్రసన్న, హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రీనివాసరెడ్డి, అభివృద్ధి కమిటీ సభ్యులు గోలివాడ చంద్రకళ, రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.