Chigurumamidi | చిగురుమామిడి, జూలై 13: ఎన్నికల్లో హామీలో భాగంగా గ్రామంలో ఇచ్చిన హామీని సర్పంచ్ మాటకు కట్టుబడి నిలబెట్టుకున్నాడు. చిగురుమామిడి మండలంలోని లంబాడి పల్లి గ్రామానికి చెందిన కాటం సంపత్ రెడ్డి సర్పంచ్ ఎన్నికల్లో గ్రామంలో పుట్టిన ఆడపిల్లకు రూ.5016 పాప పేరుపై ఫిక్స్ డిపాజిట్ చేస్తానని ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు. అందులో భాగంగా గ్రామంలో బండారుపల్లి లాస్య మహేందర్ కు ఆడబిడ్డ జన్మించగా, పుట్టిన పాప పేరు మీద రూ.5016 ఫిక్స్డ్ చేసి డిపాజిట్ పత్రాన్ని సోమవారం వారికి అందజేశారు. వీరి వెంట వార్డు సభ్యులు శ్రీకాంత్, లచ్చయ్య, పంచాయతీ కార్యదర్శి పద్మావతి, ఏఎన్ఎం రజిత, ఆశాలు మంజుల, బండారుపల్లి రాజు, కనకారెడ్డి, పరశురాములు తదితరులు ఉన్నారు.