ఘనంగా బతుకమ్మ సంబురాలు
జిల్లా కేంద్రంలో మూడో రోజు బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా, ముద్దపప్పు బతుకమ్మగా అమ్మవారిని పూజించి, బతుకమ్మ ఆడిపాడారు. జిల్లా ఎల్లాపు సంఘం భవనం చింతకుంటలో బతుకమ్మ వేడుకలు కరీంనగర్ జిల్లా అర్బన్ యూనిట్.
- మూడో రోజు మద్దుపప్పు బతుకమ్మ
- ఆడిపాడిన మహిళలు
కమాన్‌చౌరస్తా, అక్టోబర్ 16 : జిల్లా కేంద్రంలో మూడో రోజు బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా, ముద్దపప్పు బతుకమ్మగా అమ్మవారిని పూజించి, బతుకమ్మ ఆడిపాడారు. జిల్లా ఎల్లాపు సంఘం భవనం చింతకుంటలో బతుకమ్మ వేడుకలు కరీంనగర్ జిల్లా అర్బన్ యూనిట్, రూరల్ యూనిట్ ఆధ్వర్యంలో అట్టహాసంగా సాగాయి. మహిళా కమిటీ సంఘం గౌరవాధ్యక్షురాలు వీర్ల సరోజన, అధ్యక్షురాలు బోనగిరి హరిప్రియ, మాజీ కార్పొరేటర్ తాటి ప్రభావతి, లకాకుల ఉమారాణి, పెంచాల సరస్వతి లావణ్య, రమాదేవి, బోనగిరి పద్మలత, ఉషారాణి పాల్గొన్నారు.
ట్రినిటీ కళాశాలలో బతుకమ్మ సంబురాలు అట్టహాసంగా సాగాయి. మెయిన్ క్యాంపస్‌లో 1100 మంది విద్యార్థులు హాజరై ఆడిపాడారు. కళాశాల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి పండుగ విశిష్టతను వివరించారు. కళాశాలల డీన్, ఏవో, వివిధ బ్రాంచ్ ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు పాల్గొన్నారు. కరీంనగర్ ఇంపాక్ట్ వారియర్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఇంపాక్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట్రావ్ మాట్లాడుతూ, తెలంగాణ ఆడపడుచులకు ముఖ్య పండుగ బతుకమ్మ అన్నారు. ఇంపాక్ట్ కరీంనగర్ సలహాదారురాలు అనిత, సభ్యులు పిన్నం రవి, లక్ష్మణ్ కుమార్, సయ్యం సాయిబాబు, సుధాకర్, 100 మంది ట్రైనర్స్ పాల్గొన్నారు.

మేము సైతంఆధ్వర్యంలో
విద్యానగర్, అక్టోబర్ 16: మేము సైతం యువసేన ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదల వాడల్లో సోమవారం బతుకమ్మ సంబురాలు జరుపుకొన్నారు. పిల్లలకు బతుకమ్మ పేర్చడం పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. బతుకమ్మ ప్రసాదం, దాండియా కోలాలు, కొత్త బట్టలు అందజేశారు. కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షురాలు స్వప్న- శ్రీనివాస్, రూప, విక్రమ్ పాల్గొన్నారు
ట్రినిటీ ఇంజినీరింగ్ కళాశాలలో..
కరీంనగర్ రూరల్, అక్టోబర్ 16: ట్రినిటీ ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో సోమవారం విద్యార్థులు బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన ప్రదర్శనలు పలువురిని అలరించాయి. కళాశాలల చైర్మన్ డాక్టర్ ప్రశాంత్‌రెడ్డి ఏవో, ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, సిబ్బంది వేడుకలను తిలకించారు.
అంగన్వాడీ కేంద్రాల్లో..
కలెక్టరేట్, అక్టోబర్ 16 : నగరంలోని అంగన్వాడీ కేంద్రాల్లో సోమవారం బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. కోతిరాంపూర్ సెక్టార్ పరిధిలోని పోచమ్మవాడ, హౌసింగ్‌బోర్డు, లక్ష్మీనగర్, కాపువాడ, కట్టరాంపూర్ సెంటర్లలో బతుకమ్మలు ఆడారు. అంగన్వాడీ టీచర్లు స్వరూపారాణి, శ్యామల, పద్మ, హేమలత, రజిత, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

