Karimnagar | కరీంనగర్ నుంచి వరంగల్ కు నాన్ స్టాప్ ఆర్టీసీ బస్ సర్వీసులు
కరీంనగర్ నుంచి వరంగల్ వరకు జాతీయ రహదారి ఎన్ హెచ్ 563 నిర్మాణం పూర్తి అయింది. దీంతో కరీంనగర్ నుంచి వరంగల్‌కు నాన్‌స్టాప్ బస్సు సర్వీసులను నడపనున్నట్లు కరీంనగర్-2 డిపో మేనేజర్ రవీంద్రనాథ్ తెలిపారు.
Karimnagar | తెలంగాణ చౌక్, నవంబర్ 1 : కరీంనగర్ నుంచి వరంగల్ వరకు జాతీయ రహదారి ఎన్ హెచ్ 563 నిర్మాణం పూర్తి అయింది. దీంతో కరీంనగర్ నుంచి వరంగల్‌కు నాన్‌స్టాప్ బస్సు సర్వీసులను నడపనున్నట్లు కరీంనగర్-2 డిపో మేనేజర్ రవీంద్రనాథ్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రయాణికుల కోరిక మేరకు కరీంనగర్ నుంచి వరంగల్ కు నాన్ స్టాప్ బస్ లను వారి సౌకర్యార్థం నడిపించాలని నిర్ణయించినట్లు వివరించారు. కాగా సోమవారం నుంచి కరీంనగర్-వరంగల్ వరకు ఎలక్ట్రిక్ (ఈ వీ) డీలక్స్ బస్సు లను నడిపించనున్నారు. ఉదయం 7.15 నిమిషాలకు, 8 గంటలకు, మళ్లీ 8.30గంటలకు, 9.00 గంటలకు నాలుగు బస్ లు నడుస్తాయని వివరించారు. ఈ బస్సు సర్వీసులు ప్రతీ రోజూ ఒక్క బస్ మూడు ట్రీప్ లు తిరుగనున్నట్లు పేర్కొన్నారు.
మార్గ మధ్య లో కేశవ పట్నం, హుజురాబాద్, ఎలకతుర్తి, హాసన్ పర్తిలో ఈ బస్సులు ఆగవని, నేరుగా మొదటి ట్రిప్ వరంగల్ వరకు, తరువాత ట్రిప్ లు హనుమకొండ వరకు నడుస్తాయని డీఎం తెలిపారు. టికెట్ చార్జీలో ఎలాంటి మార్పు ఉండదన్నారు. యథావిధిగా చెల్లించే టికెట్ చార్జీ రూ.150 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆర్టీసీ కలిపిస్తున్న ఈ సౌర్యాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని డీఎం కోరారు. కాగా కరీంనగర్ నుంచి వరంగల్ మధ్య ముఖ్య పట్టణం హుజురాబాద్ లో నాన్ స్టాఫ్ బస్ ఆపాలని పట్టణ వాసులు కోరుతున్నారని, నిత్యం హుజురాబాద్ నుంచి జిల్లా కేంద్రం కరీంనగర్ కు అలాగే వ్యాపార, విద్య అవసరాల కోసం వరంగల్ కు రాక పోకలు కొనసాగించే ప్రయాణాలకు సౌకర్యంగా ఉంటుందని ప్రజలు కోరుకుంటున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vande Bharat Sleeper Train | పట్టాలెక్కిన బెంగళూరు-ముంబై వందే భారత్ స్లీపర్ రైలు.. ప్రారంభించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
Kangana Ravi Babu | కంగనా రనౌత్‌తో రవిబాబు హారర్ సినిమా.. నిర్మాతగా రానా దగ్గుబాటి, టైటిల్ ఏంటంటే..!
KTR | రైతుల బతుకులను నాశనం చేస్తున్న రేవంత్‌రెడ్డి : కేటీఆర్
KTR Tour Photos | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అడుగడుగునా నీరాజనం.. ఫోటోలు
Home Guard Killed | బహిరంగంగా మద్యం తాగడాన్ని అడ్డుకున్న హోమ్ గార్డు.. కొట్టి చంపిన ముగ్గురు వ్యక్తులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

