నర్సింగ్ ఆఫీసర్లకు జీతాలేవి
రాష్ట్ర ప్రభుత్వం కరీంనగర్ జిల్లాలో 200 మంది నర్సింగ్ ఆఫీసర్లను గత ఫిబ్రవరిలో నియమించింది. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా నియామక ఉత్తర్వులు అందించారు. అంతేకాదు, స్టాఫ్ నర్సుల పేరును నర్సింగ్ ఆఫీసర్లుగా మార్చుతూ నిర్ణయం కూడా తీసుకున్నారు.
- మూడు నెలల కిందే నియామకం
- కరీంనగర్ ప్రభుత్వ దవాఖానలో విధులు
- అప్పటి నుంచీ అందని సాలరీలు
- సీపీఎస్, ఐడీ నంబర్ల జారీలో నిర్లక్ష్యమే కారణం
- పట్టని ఉన్నతాధికారులు
- ఇబ్బందుల్లో 200 మంది ఉద్యోగులు
నర్సింగ్ ఆఫీసర్ల కడుపుమాడుతున్నది. జీతాలు అందక బతుకు ఆగమైపోతున్నది. డిస్ట్రిక్ మెడికల్ ఎడ్యుకేషన్ కింద గత ఫిబ్రవరిలోనే నియమితులై కరీంనగర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో విధులు నిర్వహిస్తుండగా, వారికి ఉద్యోగం వచ్చిందనే సంబురమే లేకుండా పోయింది. సీపీఎస్, ఐడీ నంబర్ల జారీలో ట్రెజరీ, జీజీహెచ్ విభాగాల్లోని అధికారుల నిర్లక్ష్యంతో మూడు నెలలుగా శాలరీల చెల్లింపు ప్రక్రియ నిలిచిపోగా, వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది.
విద్యానగర్, మే 22: రాష్ట్ర ప్రభుత్వం కరీంనగర్ జిల్లాలో 200 మంది నర్సింగ్ ఆఫీసర్లను గత ఫిబ్రవరిలో నియమించింది. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా నియామక ఉత్తర్వులు అందించారు. అంతేకాదు, స్టాఫ్ నర్సుల పేరును నర్సింగ్ ఆఫీసర్లుగా మార్చుతూ నిర్ణయం కూడా తీసుకున్నారు. డిస్ట్రిక్ మెడికల్ ఎడ్యుకేషన్ కింద నియమితులైన వారికి కరీంనగర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్(జీజీహెచ్)లో విధులు అప్పగించింది. అయితే వారికి ఉద్యోగంలో చేరామనే సంతోషమే లేకుండా పోయింది. సీపీఎస్, ఐడీ నంబర్లు జారీ చేయకపోవడంతో ఇప్పటి వరకు జీతాలు రావడం లేదు. నిజానికి వీరు చేరిన నెలలోనే ఈ నంబర్లు ఇచ్చి వేతనాలు అందేలా చూడాలి. అయితే మరి స్థానికంగా జరిగిన పొరపాటా..? ట్రెజరీ అధికారుల నిర్లక్ష్యమా..? తెలియదుగానీ శాలరీ నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్నారు. అటు ట్రెజరీ, జీజీహెచ్‌లోని సంబంధిత సెక్షన్ల చుట్టూ తిరుగుతున్నారు. ట్రెజరీలో అడిగితే సంబంధిత సెక్షన్ నుంచి తమకు వేతన బిల్లులు రావడం లేదని చెబుతుండగా, ట్రెజరీ అధికారులు సీపీఎస్, ఐడీ నంబర్లు ఇస్తేనే బిల్లులు చెల్లించే అవకాశం ఉంటుందని సెక్షన్ ఆఫీసర్లు చెబుతున్నారు. ట్రెజరీ, జీజీహెచ్ సంబంధిత క్లర్క్‌ల నిర్లక్ష్యంతోనే వేతనాలు ఆగిపోతున్నాయని నర్సింగ్ ఆఫీసర్లు వాపోతున్నారు. ఈ నెల 25లోగా బిల్లులు అప్పగిస్తే తప్ప వచ్చేనెల వేతనాలు అందే పరిస్థితి కనిపించకపోవడంతో ఈ విషయంలో ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలని కోరుతున్నారు.
వేతనాలు అందిస్తాం
కరీంనగర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో పనిచేస్తున్న 200 మంది నర్సింగ్ ఆఫీసర్లుకు ఐడీ, సీపీఎస్ నంబర్లు రాకపోవడంతో వేతనాల చెల్లింపులో జాప్యం జరుగుతున్నది. ఇప్పటికే ట్రేజరీ అధికారులతో మాట్లాడాం. ఐడీ నెంబర్లు వచ్చాయి. అలాగే 50 మందికి సీపీఎస్ నంబర్లు కూడా కేటాయింపు జరిగింది. మరో 150 మందివి నేడో, రేపో పూర్తవుతాయని ట్రేజరీ ఆఫీసర్లు చెబుతున్నరు. మొత్తం మీద ఈ నెల 25 లోగా బిల్లులు చేసి వేతనాలు వచ్చేలా చర్యలు తీసుకుంటాం. అయితే ఇన్ని రోజులు జరిగిన జాప్యానికి గల కారణాలను తెలుసుకొని ఉన్నతాధికారులకు నివేదిస్తా.
– గుండా వీరారెడ్డి, జీజీహెచ్ సూపరింటెండెంట్ (కరీంనగర్)
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

