Veenavanka | వీణవంక, అక్టోబర్ 3 : వీణవంక మండలంలోని హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన లక్కాకుల శ్రీనివాస్ జాతీయస్థాయి వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అవార్డు పొందారు. లక్కాకుల శ్రీనివాస్ సిగ్మా అకాడమీ ఆఫ్ ఫొటోగ్రఫీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియన్ వెడ్డింగ్ ఫొటోగ్రఫీ కాంటెస్ట్ లో హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన లక్కాకుల శ్రీనివాస్ కి Sap hm ribbon అవార్డు, వెయ్యి రూపాయల నగదు బహుమతి అందుకున్నారు. హైదరాబాద్‌లో జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో భాగంగా Sap ఫౌండర్ ఎంసీ శేఖర్ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం జరిగింది.
గత 16 సంవత్సరాలుగా వెడ్డింగ్ ఫొటోగ్రఫీ రంగంలో అనుభవం కలిగిన శ్రీనివాస్ వీణవంక మండల స్థాయిని జాతీయ స్థాయి వరకు చేర్చినందుకుగాను వీణవంక మండల ప్రెసిడెంట్ సంగెం మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా మోహన్‌తోపాటు సంఘ సభ్యులు, హిమ్మత్ నగర్ గ్రామస్తులు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ నిర్వాహకులకు తమ కుటుంబ సభ్యులకు తనకు సహకరించిన మిత్రులు, పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేశారు.