సలహాలు ఇస్తే దూషిస్తరా?
కాంగ్రెస్‌కు నిర్మాణాత్మమైన సూచనలు, సలహాలు ఇస్తుంటే ఆ పార్టీ నాయకులు తనపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని తాను సూచిస్తే మంత్రి పొన్నం ప్రభాకర్ తనను వ్యక్తిగతంగా దూషించడం ఎంత వరకు సమంజసమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు.
- నన్ను వ్యక్తిగతంగా కెలకొద్దు
- మంత్రి పొన్నంకు ఎంపీ బండి సంజయ్ హితవు
కరీంనగర్ విద్యానగర్, జనవరి 14 : కాంగ్రెస్‌కు నిర్మాణాత్మమైన సూచనలు, సలహాలు ఇస్తుంటే ఆ పార్టీ నాయకులు తనపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని తాను సూచిస్తే మంత్రి పొన్నం ప్రభాకర్ తనను వ్యక్తిగతంగా దూషించడం ఎంత వరకు సమంజసమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. పొన్నం ప్రభాకర్ వల్లనే కాంగ్రెస్ నాశనం అవుతుందని విమర్శించారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంతోపాటు హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో జరిగిన వీరభద్ర స్వామి ఆలయం వద్ద మాట్లాడిన ఆయన పొన్నంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాను బీఆర్ఎస్ నాయకులపై మాట్లాడితే మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఎందుకు కోపం వస్తోందని ప్రశ్నించారు. తాము రాష్ట్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్‌కు పూర్తి స్థాయిలో సహకరిస్తామని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు కేంద్రంపై విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. తనను వ్యక్తిగతంగా కెలకొద్దని, చిల్లర మాటలు మాట్లాడినా సంస్కారంతో వ్యవహరిస్తున్నానన్నారు. పొన్నం కరీంనగర్‌ను వదిలి హుస్నాబాద్ ఎందుకు పారిపోయాడో అందరికీ తెలుసన్నారు. రైతుబంధు అందక 48 లక్షల మంది రైతులు అల్లాడుతున్నారన్నారు.
కేంద్రం సహాయం లేకుంటే రాష్ట్రంలో అప్పులెలా తీరుస్తారని ప్రశ్నించారు. రాహుల్ ప్రాపకం కోసమో, అధిష్టానం ఒత్తిడితోనో కాంగ్రెస్ నాయకులు బీజేపీపై విమర్శలు చేస్తే అది రాష్ట్రానికే నష్టమనే వాస్తవాన్ని గమనించాలని హితవు పలికారు. అయోధ్య రామమందిరం పూర్తికాకముందే పున: ప్రతిష్ట చేస్తున్నారనే ఆరోపణలపై స్పందించిన బండి సంజయ్ సాధు సంతువులు సూచించిన మంచి ముహూర్తం ప్రకారమే ఆలయ ప్రతిష్ట చేస్తున్నామని పేర్కొన్నారు. దీనిపై రాజకీయాలు చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ నాయకులు రామ మందిర నిర్మాణానికి అనుకూలమా? వ్యతిరేకమా? సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడగానే ఈ దేశంలో విధ్వంసం జరగాలని కాంగ్రెస్ కోరుకున్నదని మండిపడ్డారు. అందరం కలిసి కేంద్రాన్ని ఒప్పించి అధిక నిధులు తీసుకొద్దామని కోరుకుంటున్నానని సూచించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

