వేములవాడ రూరల్, జనవరి 16: పెండ్లయి ఏండ్లు గడుస్తున్నా సంతానం కలుగడం లేదని కొడుకు, కొడుకు బాధను చూడలేక తల్లీ.. ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన వేములవాడ మండలం చెక్కపల్లిలో విషాదాన్ని నింపింది. ఎస్ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొండవేణి మల్ల వ్వ (51)- దేవయ్య దంపతుల కొడుకు కనకయ్య (33) ఉన్నాడు. కనకయ్యకు కొన్నేండ్ల క్రితమే వివాహం జరిగింది. తల్లీదండ్రులతో కలిసి కనకయ్య గొర్రెలు కాస్తూ జీవిస్తున్నాడు. అయితే ఏండ్లు గడుస్తున్నా కనకయ్యకు సంతా నం కలుగడం లేదు.
పలు దవాఖానలు తిరిగి నా ప్రయోజనం లేకపోవగా, భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో కనకయ్య మనస్తాపానికి గురయ్యాడు. అయితే ఆదివారం ఉదయం తండ్రి దేవయ్య గొర్రెల మందను మేతకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో తనకు సంతానం కలుగడం లేదని కనకయ్య, కొడుకు బాధను చూడలేక తల్లి మల్లవ్వ ఇద్దరూ కలిసి ఇంట్లో దూలానికి ఉరేసుకున్నారు. దేవయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.