Peddapally | అంతర్గాం, డిసెంబర్ 31 : అంతర్గాం మండలం లింగాపూర్ మెాడల్ స్కూల్ కు చెందిన విద్యార్థులు జిల్లా స్థాయి మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ అత్యత్తమ ప్రతిభ కనబరిచారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ పీ అఖిల్, టీ జశ్వంత్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానం సాధించారు. కాగా వీరికి రూ.2500 నగదు బహుమతి అందజేశారు.
జిల్లా మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ తమ విద్యార్థులు ప్రథమ స్థానం స్థానం సాధించడంతమ పాఠశాల గర్వకారణమని పాఠశాల ప్రిన్సిపల్ పీ సదానందం తెలిపారు. విజయం సాధించిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్‌కు ఎంపికైనందుకు వారిని అభినందించారు.