కాల్వశ్రీరాంపూర్, జనవరి19: పల్లెల అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేద్దామని మండలి విప్ భానుప్రసాద్‌రావు పిలుపునిచ్చారు. ‘మన ఊరు-మన బడి’లో భాగంగా కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లిలో 28.68 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గది, డైనింగ్‌హాల్, ఆరెపల్లిలో 20లక్షల ఈజీఎస్ నిధుల తో నిర్మించిన జీపీ భవనాన్ని శుక్రవారం ఎమ్మె ల్యే విజయరమణారావుతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ఇంటింటికీ సంక్షేమ ఫలాలు అందించామని గుర్తు చేశారు. గ్రామాలు అభివృద్ధి బాట లో పయనిస్తున్నాయని, ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ, పంటలకు ఇబ్బంది లేకుండా సాగునీరందిస్తామని యాసంగి వడ్ల కొనుగోలులో గింజ కటింగ్ కాకుండా చూస్తామన్నారు.
మహిళా సంఘ భవనం, జీపీ కాంపౌండ్ వా ల్కు నిధులు మంజూరుతోపాటు వాటర్ ప్లాంట్ నిర్మిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామస్తులు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీని పూలమాల లు వేసి, శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ నూనేటి సంపత్, జడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డి, సర్పంచులు పొన్నమనేని దేవేందర్‌రావు, ఆరెల్లి సుజాత రమేశ్, ఎంపీటీ సీ సుముఖం నిర్మల మల్లారెడ్డి, మాజీ ఎంపీపీ గోపగాని సారయ్యగౌడ్, ఎంపీడీవో రాం మో హనాచారి, ఎంపీవో గోవర్ధన్, ఉప సర్పంచులు గరిడె అశోక్, సుఖేందర్‌రెడ్డి పాల్గొన్నారు.