బీసీ బిడ్డను అసెంబ్లీకి పంపండి
బలహీనవర్గాల బిడ్డ ను..ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే ఐదేండ్లు సేవలందిస్తా.’అంటూ మంథని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ ఓటర్లకు పిలుపునిచ్చారు. శుక్రవారం రామగిరి మండలం రామయ్యపల్లి, రాజాపూర్, ఆదివారంపేట గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
- కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించండి
- మంథని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్
రామగిరి నవంబర్ 24 : బలహీనవర్గాల బిడ్డ ను..ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే ఐదేండ్లు సేవలందిస్తా.’అంటూ మంథని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ ఓటర్లకు పిలుపునిచ్చారు. శుక్రవారం రామగిరి మండలం రామయ్యపల్లి, రాజాపూర్, ఆదివారంపేట గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేస్తూ ఓట్లు అభ్యర్ధించారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ ఒక సామాన్య కుటుంబంలో జన్మిం చి మీ అందరి ఆశీస్సులతో ఈ స్థాయికి ఎదిగి మీ తమ్ముడిలా అన్నలా కొడుకులా పనిచేస్తుంటే అబద్దాలు అసత్య ప్రచారాలతో దూరం చేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశా రు.
మీ సమస్యలను నా సమస్యలుగా భావించి ఎమ్మెల్యేగా ఓడిపోయినా ప్రజలకు సేవలు అం దించానే తప్ప ఎలాంటి తప్పు చేయలేదన్నా రు. రామయ్యపల్లికి చెందిన వ్యక్తి గరీబు బిడ్డను గౌరవంగా బతకాలని ఈ మండల ఎంపీపీని చేస్తే కాంగ్రెస్ అభ్యర్థి వంచనచేరి తనపై బురదజల్లడం బాధాకరమన్నారు. తనపై సత్యదూర పు ఆరోపణలు చేస్తున్నారని ఆక్షేపించారు. సద రు ప్రజాప్రతినిధి చెకులపై సంతకాలు పెట్టి దివ్యాంగుడి భూమి లాకున్నారని, తన వద్ద ఆధారాలు ఉన్నాయని వివరించారు. ఓడేడ్ సర్పంచ్ మీనాజీపేటకు పోయి అకడి మాజీ జడ్పీటీసీపై దాడి చేసి ఆ ఘటనలో తనను బాధ్యుడిని చేసి కేసు పెట్టారని అంతేకాకుండా సదరు సర్పంచ్ ఒరే పుట్ట మధూ నీ అంతుచూ స్తా.. అంటూ బెదిరింపులకు దిగుతున్నాడన్నా రు.
మాజీ నక్సల్స్, రౌడీషీటర్లను తనపై ఉసిగోల్పుతూ అంతం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని అరోపించారు. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ అభ్యర్థిని నిలదీయాలని ప్రజలను కోరారు. ఎన్నికలు వస్తే పైసలు, గడియారాలు, చీరెలు పంచి అధికారంలోకి రావచ్చనే ఆలోచన తప్ప ఓట్లు వేసిన ప్రజలకు సాయం చేయాలనే ఆలోచన కాంగ్రెస్ అభ్యర్థికి లేదన్నారు. అలాంటి నాయకుడికి ఓటుతో బుద్ధి చెప్పాలని విజ్ఞప్తిచేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శారద, వైస్ ఎంపీపీ కాపురబోయిన శ్రీదేవి భాస్కర్, సర్పంచ్‌లు పాశం ఓదేలు, మైదం కుమార్, ఎంపీటీసీ మెడగోని ఉమ రాజన్న, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కన్నూరి శ్రీశైలం పాల్గొన్నారు.
కేసీఆర్ పాలనలోనే కార్మికులకు న్యాయం
సెంటనరీకాలనీ నుంచి మంథని వరకు సింగరేణి యువ కార్మికులు శుక్రవారం చేపట్టిన పాదయాత్రకు ఆర్జీ- 3 ఓసీపీ- 2 వద్ద మంథని బీఆర్ఎస్ ఆభ్యర్థి పుట్ట మధూకర్ స్వాగతం పలికారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి వెలుగులు పంచే సింగరేణి సంస్థలో పనిచేసే కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేసి ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. తన గెలుపు కోసం పాదయాత్ర నిర్వహించడం అభినందనీయమన్నారు. సింగరేణి యువ కార్మికులను ఆదర్శంగా తీసుకుని యు వకులు గొప్పగా ఆలోచన చేసి మంచి నాయకత్వాన్ని బలపరచాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

