నేడు సిరిసిల్లకు మంత్రి కేటీఆర్
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లాకు రానున్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 15వేల మందితో మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించనున్న వజ్రోత్సవ సభకు హాజరవుతారు
- సిరిసిల్ల, వేములవాడలో వజ్రోత్సవ సభలకు రాక
- కొత్త ఆసరా పింఛన్ పత్రాలు పంపిణీ
- రేపు ఉదయం కలెక్టరేట్లో జాతీయ జెండావిష్కరణకు హాజరు
రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లాకు రానున్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 15వేల మందితో మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించనున్న వజ్రోత్సవ సభకు హాజరవుతారు. ఈ సభలో అర్హులైన కొత్త ఆసరా లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేసి, ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు వేములవాడ చేరుకుంటారు. ఆలయ చెరువు మైదానంలో 15 వేల మందితో జరిగే వజ్రోత్సవ వేడుకలకు హాజరై ప్రజలనుద్దేశించి మాట్లాడుతారు. సాయంత్రం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. శనివారం ఉదయం 9 గంటలకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతారు. మంత్రి రాక సందర్భంగా సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
టీపీటీడీసీఎల్ చైర్మన్ గూడూరికి కేటీఆర్ అభినందన

తెలంగాణ పవర్‌లూమ్స్ అండ్ టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీపీటీడీసీఎల్) చైర్మన్‌గా నియామకమైన గూడూరి ప్రవీణ్ గురువారం ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. సిరిసిల్ల జిల్లా నాయకులతో కలిసి వెళ్లి తన నియామకానికి సహకరించిన మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం గూడురిని కేటీఆర్ అభినందించారు. – సిరిసిల్ల టౌన్, సెప్టెంబర్ 15
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

