Nizamabad | నిజామాబాద్ జిల్లా కేంద్రంలో భారీ పేలుడు.. చెత్త కుప్పలో పేలుడు దాటికి తునా తునక లైన మహిళా శరీరం
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పేలుడు ఘటన కలకలం సృష్టించింది. నగరంలోని మిర్చి కాంపౌండ్ ప్రాంతంలో ఓ కాళీ ప్రదేశంలో భారీగా పేరుకుపోయిన చెత్తలో ఓ మహిళ పనికిరాని వస్తువులు ఏరుకుంటోంది. కాగా అక్కడ పేలుడు ఘటన సంభవించినట్లు స్థానికులు తెలిపారు.
- పేలుడు శబ్దానికి చుట్టుపక్కల భవనాల అద్దాలు ధ్వంసం
- ఏం పేలిందో తెలియక లోతుగా దర్యాప్తు నిర్వహిస్తున్న పోలీసులు
- పేలుడు ఘటనపై లోతుగా దర్యాప్తు ఏసీపీ ప్రకాష్ యాదవ్
Nizamabad | వినాయక్ నగర్, అక్టోబర్: 13 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పేలుడు ఘటన కలకలం సృష్టించింది. నగరంలోని మిర్చి కాంపౌండ్ ప్రాంతంలో ఓ కాళీ ప్రదేశంలో భారీగా పేరుకుపోయిన చెత్తలో ఓ మహిళ పనికిరాని వస్తువులు ఏరుకుంటోంది. కాగా అక్కడ పేలుడు ఘటన సంభవించినట్లు స్థానికులు తెలిపారు. గుర్తుతెలియని మహిళ చెత్త కుప్పలోంచి గుర్తుతెలియని వస్తువు చేతిలో పట్టుకోగానే భారీగా పేలుడు సంభవించింది. దీంతో ఆ పేలుడు దాటికి మహిళ శరీర భాగాలు తునా తునకలై ఎగిరి పడ్డాయి. దీంతోపాటు పేలుడు భారీ శబ్దానికి పరిసర ప్రాంతాలలో ఉన్న భవనాల అద్దాలు సైతం ధ్వంసమయ్యాయి. దీంతోపాటు పేలుడు శబ్దం చుట్టుపక్కల ప్రాంతాలలో సుమారు కిలోమీటర్ వరకు వినిపించడంతో స్థానికులు ఏం జరిగిందో అని ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు.
విషయం తెలుసుకున్న నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్ యాదవ్, వన్ టౌన్ ఎస్హెచ్ఓ శ్రీనివాస్ తమ సిబ్బందితో కలిసి మిర్చి కాంపౌండ్ ప్రాంతంలో జరిగిన పేలుడు ఘటన స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు చుట్టుపక్కల ఎగిరిపడిన మహిళ శరీర భాగాలను సేకరించారు. అయితే ఈ పేలుడు ఏదైనా బ్యాటరీ వల్ల జరిగిందా లేక, ఇతర ఏదైనా వస్తువు పేలిందా అనే కోణంలో దర్యాప్తు నిర్వహిస్తున్నట్లుగా ఏసీపీ ప్రకాష్ యాదవ్ తెలిపారు. ఈ ఘటనపై ఒకటవ టౌన్ ఎస్ హెచ్ ఓ శ్రీనివాస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పేలుడు దాటికి శరీర భాగాలు తెగిపడిపోయిన మహిళ ఆనవాళ్లు సైతం గుర్తించలేకుండా ఉండడంతో మృతి చెందిన మహిళ ఎవరనే కోణంలో సైతం పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs | ఇండియన్ ఆర్మీలో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 57.. జేఈఈ మెయిన్ స్కోర్‌తో ప్రవేశాలు
Rajamouli | అమెరికాలో రాజమౌళి.. ‘వారణాసి’ షూటింగ్‌కు విరామం, కుటుంబ వేడుకలో సందడి!
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
Chakali llamma | చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసంపై పద్మా దేవేందర్‌రెడ్డి ఆగ్రహం
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

