Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
Parvinder Jhota : డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న పర్వీందర్ సింగ్ అలియాస్ జోటాను కాల్చి చంపారు. మెడికల్ షాపుల్లో డ్రగ్స్ ను అక్రమంగా అమ్ముతున్నట్లు ఎఫ్బీ లైవ్‌లో ఓ వీడియో చేస్తున్న సమయంలోనే ఈ ఘటన జరిగింది.
చండీఘడ్: డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న పర్వీందర్ సింగ్(Parvinder Jhota) అలియాస్ జోటాను కాల్చి చంపారు. మెడికల్ షాపుల్లో డ్రగ్స్ ను అక్రమంగా అమ్ముతున్నట్లు ఓ వీడియో తీస్తున్న సమయంలోనే ఈ ఘటన జరిగింది. మానస పట్టణంలోని ఓ కెమిస్ట్ షాపు వద్ద ఆ షాపు ఓనర్ అతన్ని కాల్చేశాడు. అయితే ఈ ఘటన మొత్తం ఫేస్బుక్లో లైవ్ స్ట్రీమింగ్ అయ్యింది. పర్వీందర్తో ఉన్న మరో నలుగురికి బుల్లెట్ గాయాలు అయ్యాయని పోలీసులు చెప్పారు. కొన్ని రకాల డ్రగ్స్‌ను అమ్మడాన్ని వ్యతిరేకిస్తూ కెమిస్ట్ షాపు ఓనర్‌తో జోటా ఘర్షణ పడ్డారు. ఆ సమయంలో జరుగుతున్న వాగ్వాదాన్ని అతను రికార్డు చేశాడు. అయితే ఆ సమయంలోనే ఆ షాపు ఓనర్ అతన్ని షూట్ చేశాడు.
జోటా ఫేస్బుక్ పేజీలో 5.48 నిమిషాల లైవ్ వీడియోను స్ట్రీమింగ్ చేశారు. కెమిస్ట్ షాపు ఓనర్ పిస్తోల్‌ను బయటకు తీశాడని లైవ్‌లో చెబుతున్న సమయంలోనే అతన్ని షూట్ చేశాడు.మానస పట్టణంలోని సివిల్ ఆస్పత్రికి తరలించారు. కానీ జోటా మాత్రం మృతిచెందినట్లు డాక్టర్లు చెప్పారు. పర్వీందర్కు మూడు బుల్లెట్ గాయాలు అయినట్లు ఆస్పత్రి డాక్టర్ గుర్మెయిల్ సింగ్ తెలిపారు. రెండు కడుపులో, ఒకటి తొడలో దిగినట్లు చెప్పారు. లివర్‌లో బుల్లెట్ దిగడం వల్ల అతను మరణించినట్లు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
Chakali llamma | చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసంపై పద్మా దేవేందర్‌రెడ్డి ఆగ్రహం
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

