Jobs | ఇండియన్ ఆర్మీలో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 57.. జేఈఈ మెయిన్ స్కోర్‌తో ప్రవేశాలు
Jobs | ఇంటర్ పూర్తి చేసినవారికి ఇండియన్ ఆర్మీ శుభవార్త ప్రకటించింది. బీటెక్ కోర్సుతో పాటు ఉద్యోగ అవకాశం కల్పిస్తుంది. జేఈఈ మెయిన్ స్కోర్‌తో ప్రవేశాలు కల్పిస్తుంది. ఆర్మీలో టెక్నికల్ ఉద్యోగం చేయాలకునేవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.
Jobs | ఇండియన్ ఆర్మీ 57వ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ (TES) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా సుమారు 90 లేదా అంతకంటే ఎక్కువ ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ కోర్సు జూలై 2027 నుంచి ప్రారంభమవుతుంది. జేఈఈ మెయిన్ రాసినవారు దీనికి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ రేపటి (అక్టోబర్ 14) నుంచి ప్రారంభమవుతుంది. నవంబర్ 12 వరకు కొనసాగుతుంది.
పోస్టు పేరు
కమిషన్డ్ ఆఫీసర్
కోర్సు
10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్- 57
ప్రారంభం
2027, జూలై
అర్హతలు
అభ్యర్థులు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ (PCM) సబ్జెక్టులు 60 శాతం మార్కులతో 12వ తరగతి లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణతతో పాటు జేఈఈ మెయిన్- 2026 పరీక్ష రాసి ఉండాలి.

Course
వయసు
2027, జూలై 1 నాటికి పదహారున్నర (16.5 ) నుంచి పంతొమ్మిదన్నర (19.5) సంవత్సరాల మధ్య ఉండాలి.
కేవలం అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక
అభ్యర్థులు సాధించిన విద్యార్హతలు, జేఈఈ మెయిన్ స్కోర్ ద్వారా షార్ట్‌లిస్ట్ రూపొందిస్తారు. తరువాత వీరికి SSB ఇంటర్వ్యూ, మెడికల్ టెస్టులు నిర్వహిస్తుంది.
ఎంపికైనవారికి 4 సంవత్సరాల ఉచిత ఇంజినీరింగ్ (B.Tech) కోర్సు, సైనిక శిక్షణ ఇస్తారు. విజయవంతంగా కోర్సు, సైనిక శిక్షణ పూర్తి చేసుకున్నవారికి ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగం లభిస్తుది.
చివరితేదీ
దరఖాస్తు ప్రక్రియ రేపటి (అక్టోబర్ 14) నుంచి ప్రారంభమవుతుంది. నవంబర్ 12 కొనసాగుతుంది. దరఖాస్తు, ఇతర వివరాల కోసం వెబ్సైట్ www.joinindianarmy.nic.in చూడండి.

Army Training
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs | ఇండియన్ ఆర్మీలో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 57.. జేఈఈ మెయిన్ స్కోర్‌తో ప్రవేశాలు
Rajamouli | అమెరికాలో రాజమౌళి.. ‘వారణాసి’ షూటింగ్‌కు విరామం, కుటుంబ వేడుకలో సందడి!
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
Chakali llamma | చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసంపై పద్మా దేవేందర్‌రెడ్డి ఆగ్రహం
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

