Vodithala Satish Kumar | హుస్నాబాద్ నుండి దీక్షా దివస్ సభకు పెద్ద ఎత్తున తరలింపు.. హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్
ఈ నెల 29న అలుగునూర్ లో జరగనున్న దీక్షా దివస్ సభను విజయవంతం చేసేందుకు హుస్నాబాద్ నియోజకవర్గం నుండి కార్యకర్తలు, తెలంగాణ వాదులు పెద్ద ఎత్తున తరలిస్తామని హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్ తెలిపారు.
Vodithala Satish Kumar | చిగురుమామిడి, నవంబర్ 25 : ఈ నెల 29న అలుగునూర్ లో జరగనున్న దీక్షా దివస్ సభను విజయవంతం చేసేందుకు హుస్నాబాద్ నియోజకవర్గం నుండి కార్యకర్తలు, తెలంగాణ వాదులు పెద్ద ఎత్తున తరలిస్తామని హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్ తెలిపారు. ఉద్యమ చరిత్రను ప్రతి ఒక్కరికీ తెలియజేసే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఈ సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సభ కోసం 40 ఎకరాల స్థలంలో ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతీ గ్రామం నుండి, ప్రతీ మండలం నుండి కార్యకర్తలు, తెలంగాణ వాదులు 20 వేలకు పైగా పెద్ద సంఖ్యలో బయలుదేరేలా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులు నష్టపోతున్నారని, అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా పరిస్థితి ఉందని అన్నారు. ఉద్యమంతో రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర ఉన్న నాయకత్వం మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని సతీష్ కుమార్ అన్నారు. ప్రాజెక్టులను నిర్మించి, నీళ్లిచ్చిన ఘనత, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడిన చరిత్ర గురించి ఈ సభలో ప్రజలకు వివరిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ వాదులు పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేయాలని సతీష్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దశలవారీగా జపాన్ ఉత్తమ విధానాల అమలుకు చర్యలు : కలెక్టర్ అంకిత్
Food Poison | ఎస్సీ బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్.. డోర్ తీయని సిబ్బంది..!
Aaruguru Pathivrathalu | 20 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి ‘ఆరుగురు పతివ్రతలు’.. రీ రిలీజ్ డేట్ ఫిక్స్, 4K వెర్షన్‌తో మరోసారి సందడి!
Measles | గర్భంతో ఉన్న మహిళల ద్వారా బిడ్డకు కూడా తట్టు వ్యాధి వస్తుందా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Wife kills husband | రూ.18 లక్షల ముంపు పరిహారం కోసం ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

