సిరిసిల్ల రూరల్, జూలై 24: సిరిసిల్ల (Sircilla) నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) జన్మదిన వేడుకలను పండుగల జరుపుకుంటున్నారు. సిరిసిల్ల అర్బన్ పరిధిలోని గ్రామాల్లో కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. తంగళ్లపల్లి మండలంలోని 30 గ్రామాల్లో గిఫ్ట్ ఏ స్మైల్ ద్వారా కేటీఆర్ పంపించిన కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు. అనంతరం మహిళల సమక్షంలోని కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. నిండు నూరేండ్లు కేటీఆర్ సుఖ సంతోషాలతో దీవించాలని ఆకాంక్షించారు. కేటీఆర్ బర్త్డే వేడుకలతో గ్రామాల్లో పండుగా వాతావరణం సంతరించుకుంది.
ఈ కార్యక్రమాల్లో మండల అధ్యక్షుడు గజ భీంకార్ రాజన్న, సింగిల్ విండో చైర్మన్లు బండి దేవదాస్ గౌడ్ కోడూరి భాస్కర్ గౌడ్, మాజీ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అంకారపు రవీందర్, మాజీ ఏఎంసీ చైర్మన్ రవీందర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ కోడి అంతయ్య, మాజీ ఏఎంసీ చైర్పర్సన్ పూసపల్లి సరస్వతి, జక్కుల నాగరాజు యాదవ్, యేసిరెడ్డి రాంరెడ్డి, బండి జగన్, మంద కనకరాజు, ప్యాక్స్ వైస్ చైర్మన్ వెంకటరమణ రెడ్డి, ముత్యం రెడ్డి, పార్టీ నేతలు పాల్గొన్నారు.
Sircilla 4